పరిస్థితులకు అనుగుణంగా పోలీసులకు శిక్షణ: స్వాతి లక్రా
జస్టిస్ దిశ హత్యపై షీ టీమ్స్ ఇంచార్జీ స్వాతి లక్రా విచారం వ్యక్తం చేశారు. పోలీసులకు కూడ పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ ఇస్తామన్నారు.
హైదరాబాద్: తెలంగాణ నిర్భయపై అత్యాచారం, హత్య ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా విచారం వ్యక్తం చేశారు.
ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా సోమవారం నాడు సాయంత్రం ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు. దిశ అత్యాచార, హత్య ఘటనపై ఆమె స్పందించారు. దిశ కుటుంబసభ్యులకు ఆమె తన సానుభూతిని తెలిపారు.
ఆపదలో ఉన్న వారంతా 100 నెంబర్ కు ఫోన్ చేయాలని స్వాతి లక్రా సూచించారు. 100 నెంబర్ కు పోన్ చేస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారని ఆమె చెప్పారు. ఏ నెంబర్ నుండి ఫోన్ వచ్చిందో ఆ నెంబర్ ఉపయోగిస్తున్నవారు ఎక్కడ ఉన్నారో వెళ్లి అక్కడికి చేరుకొంటారని ఆమె చెప్పారు.
100 నెంబర్ కు ఫోన్ చేసిన వారికి జవాబుదారీతనం ఉందని ఆమె గుర్తు చేశారు. జవాబుదారీతనంగానే నిర్ణీత కాల వ్యవధిలో ఆపదలో ఉన్న వారి వద్దకు పోలీసులు చేరుకొంటారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో హాక్ ఐ మొబైల్ అప్లికేషన్ ను వినియోగించాలని చెప్పారు. ప్రజల రక్షణ కోసమే ఈ ఆప్లికేషన్ ను వినియోగించుకోవాలని ఆమె మహిళలకు సూచించారు. హాక్ ఐ మొబైల్ అప్లికేషన్ గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్టుగా ఆమె తెలిపారు.
Also Read:జస్టిస్ ఫర్ దిశ: మొబైల్ ఫోన్ దొరకలేదు, 10 రోజుల కస్టడీ కోరిన పోలీసులు
పోలీస్ శాఖలో కూడ సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పోలీసు శాఖలో వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టుగా ఆమె తెలిపారు. దిశ కేసులో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐపై చర్యలు తీసుకొన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
Also Read:Justice for Disha: నిందితుడికి ప్రాణాంతక వ్యాధి, ఆర్నెళ్లకోసారి..
ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు కూడ స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె కోరారు. అత్యవసర సర్వీసుల్లో తమ శాఖను స్పందించాలని కోరాలని ఆమె తెలిపారు.