రాజ్యసభ స్థానాలపై పారిశ్రామిక వేత్తలు కన్నేశారని ప్రచారం రాజకీయ వర్గాల్లో మొదలైంది. తెలంగాణాలో రెండు రాజ్యసభ స్థానాల కోసం అధికార పార్టీ నేతలు భారీగా ఆశలు పెంచుకున్నారు. 

ఆ  స్థానాలు ఎవరికి దక్కుతాయన్నది అందరిలోనూ అసక్తి రేపుతోంది. అయితే ఈ రెండు స్థానాల్లో కేసీఆర్ పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇస్తారా.... లేదంటే ఒక స్థానంలో పార్టీ నేతకు, మరో స్థానాన్ని పారిశ్రామిక వేత్తకు కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

Also Read:పెద్దల సభకు వెళ్లేదెవరో: టిఆర్ఎస్‌లో జోరుగా చర్చలు

మాజీ ఎంపీలైన కవిత, బోయినపల్లి వినోద్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల పేర్లు టీఆర్ఎస్ నుంచి ప్రముఖంగా చర్చల్లో ఉన్నాయి. అయినప్పటికీ వారిలో ఎవరో ఒక్కరికే పదవి ఖాయమని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

మరో స్థానం భర్తీ విషయంలో సామాజిక సమీకరణలకు ముఖ్యమంత్రి పెద్ద పీటవేసే అవకాశం ఉంది. అగ్రవర్ణాలకు ఒక స్థానం దక్కితే... మరో స్థానం ఎస్సీ లేదా ఎస్సీలకు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

వీటితో పాటు రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా గుర్తింపు పొందిన మై హోం గ్రూపు సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర్ రావ్, హెటిరో ఫార్మసీ అధినేత పార్థసారథి రెడ్డిల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

Aslo Read:కేసీఆర్ ఆలోచన: తనయ కవితకు నో, రాజ్యసభకు పొంగులేటి

గత పార్లమెంట్ ఎన్నికల్లోనే పార్థ సారథి రెడ్డి ఎన్నికల బరిలో ఉంటారని వినిపించినా... చివరి నిమిషంలో అవకాశం దక్కకుండా పోయింది. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి తరపున ఈ ఇద్దరిలో ఒకరికి రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉందని గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌తో ఇద్దరు పారిశ్రామికవేత్తలకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఏమైనా జరుగొచ్చని పార్టీ నేతలు  కూడా అంటున్నారు.