పరిపూర్ణానంద స్వామి పై కూడా నగర బహిష్కరణ?

jubilee hills police notices to swami paripurnanad swamiji
Highlights

కత్తి మహేష్ పై నగర పోలీసులు తీసుకున్న నిర్ణయం పట్ల దళితుల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆయనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

 సినీ క్రిటిక్  కత్తిమహేష్ పై నగర బహిష్కరణ విధించినట్లే.. పరిపూర్ణానంద స్వామిపై కూడా విధించనున్నారా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.  శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను.. కత్తి మహేష్ ని నగరం నుంచి 6నెలల పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే.

అయితే.. రాముడిని కత్తి మహేష్ కించపరుస్తూ మాట్లాడటాన్ని వ్యతిరేకిస్తూ.. స్వామి పరిపూర్ణానంద సోమవారం నాడు యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రను తలపెట్టారు. అయితే ఈ యాత్రకు రాచకొండ పోలీసులు అనుమతి నిరాకరించారు. అంతేకాదు స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఇంట్లో ఉండే దీక్షని కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. కత్తి మహేష్ పై నగర పోలీసులు తీసుకున్న నిర్ణయం పట్ల దళితుల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆయనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పరిపూర్ణానంద స్వామి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన తన  దీక్షను విరమించకుంటే శాంతి భద్రతల నేపథ్యంలో ఆయనపై నగర బహిష్కరణ విధించే అవకాశాలు కనపడుతున్నాయి. 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader