Asianet News TeluguAsianet News Telugu

మా ఫ్యామిలీలో ఇద్దర్ని కోల్పోయా: ఎన్టీఆర్ భావోద్వేగ వ్యాఖ్యలు

సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన భద్రత మాసం కార్యక్రమంలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రోడ్డు ప్రమాదంలో తాను ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయినట్లు చెప్పారు.

Jr NTR becomes emotional in police petrolling vehicles launch
Author
Hyderabad, First Published Feb 17, 2021, 2:03 PM IST

హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన రహదారి భద్రత మాసం కార్యక్రమంలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదంలో తాను ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయానని ఆయన అన్నారు. తాను సినీ హీరోగా ఇక్కడికి రాలేదని, ఓ పౌరుడిగా ఇక్కడికి వచ్చానని ఆయన చెప్పారు. 

ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలను పాటించాలని ఆయన సూచిచారు. సైబ‌రాబాద్ పోలీసుల‌ పెట్రోలింగ్ వాహ‌నాల‌ను టాలీవుడ్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ రహదారి భద్రత మాసంలో భాగంగా సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన‌ ప్రత్యేక కార్యక్ర‌మంలో  ఆయ‌న మాట్లాడుతూ భావోద్వేగానికి గుర‌య్యారు. 

Also Read: సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఆన్వల్‌ కాన్ఫరెన్స్ లో సందడి చేసిన ఎన్టీఆర్

'నేను ఇక్క‌డికి ఓ సినీన‌టుడిగా రాలేదు.. రోడ్డు ప్ర‌మాదాల్లో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయిన ఓ పౌరుడిగా ఇక్క‌డకు వ‌చ్చాను. ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలను పాటించ‌డం అన్నింటి క‌న్నా ముఖ్య‌మైన విష‌యం' అని ఎన్టీఆర్ చెప్పాడు.

అవ‌గాహ‌న కోసం పోలీసులు అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌ని తెలిపారు. ర‌హ‌దారుల‌పై అంద‌రూ ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను పాటించి మ‌ళ్లీ సుర‌క్షితంగా ఇంటికి వెళ్లాల‌ని పిలుపునిచ్చాడు. మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తుంటుందని, అందుకని బాధ్యతగా వ్యవహరించడం అవసరమని ఆయన అన్నారు. కాగా, కార్య‌క్ర‌మం ప్రారంభించేముందు ఎన్టీఆర్‌కు పోలీసులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

Follow Us:
Download App:
  • android
  • ios