హైదరాబాద్: విరసం పత్రికకు తాను ఎడిటర్‌గా పనిచేస్తున్నందునే పూణే పోలీసులు తనను ప్రశ్నించి ఉంటారని జర్నలిస్ట్ క్రాంతి అభిప్రాయపడ్డారు. తన ఇంట్లో సుమారు 5 గంటలకు పైగా సోదాలు నిర్వహించారని ఆయన చెప్పారు.

పూణే పోలీసులు వచ్చి ఎప్ఐఆర్ కాపీని చూపి  తన ఇంట్లో సోదాలను నిర్వహించారని చెప్పారు. తన మొబైల్ ను ముందే సీజ్ చేశారని ఆయన చెప్పారు.మరో వైపు తన ల్యాప్ ట్యాప్ ను కూడ పోలీసులు సీజ్ చేశారని  చెప్పారు.

మోడీ హత్య కుట్ర కేసుతో తనకు ఎలాంటి సంబంధం  లేదన్నారు. విరసం వెబ్ సైట్ లో పనిచేస్తున్నందుకు తనను ప్రశ్నించి ఉంటారని ఆయన అబిప్రాయపడ్డారు. తొలుత క్రాంతిని కూడ అరెస్ట్ చేసినట్టు ప్రచారం సాగింది. కానీ, ఆయనను అరెస్ట్ చేయలేదని పోలీసులు ప్రకటించారు.

 

ఈ వార్తలు చదవండి

మోడీ హత్యకు కుట్రలో పేరు: విరసం నేత వరవరరావు అరెస్ట్

పూణె పోలీసుల సోదాలు: వరవరరావు ఇంటి వద్ద ఉద్రిక్తత
మోడీ హత్య కుట్రలో పేరు: వరవరరావుఇంట్లో తనిఖీలు

మోడీ హత్యకు మావోల కుట్ర: లేఖలో వరవరరావు పేరు