Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఇదే

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా వున్న 1147 పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 20 నుంచి జనవరి 5 వరకు అప్లికేషన్లను స్వీకరిస్తామని ప్రభుత్వం తెలిపింది. 

job notification for 1147 posts in telangana health and family welfare department
Author
First Published Dec 6, 2022, 7:28 PM IST

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా వున్న 1147 పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 20న ఉదయం 10.30 గంటల నుంచి జనవరి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపింది. మొత్తం 34 విభాగాల్లో 1147 పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొంది. అనస్థీషియాలో 155, జనరల్ సర్జరీలో 117, జనరల్ మెడిసిన్‌లో 111 తదితర విభాగాల్లో అత్యధిక ఖాళీలు వున్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్‌పై మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల వర్షం కురుస్తోందన్నారు. ఈ మేరకు ఆయన నోటిఫికేషన్ కూడా జత చేశారు. 

ఇదిలావుండగా... రాష్ట్రంలో  కొలువుల కుంభమేళాను నిర్వహించనున్నట్టుగా  తెలంగాణ  మంత్రి కేటీఆర్  చెప్పారు. ఇచ్చిన హామీలను తమ   ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు. ఈ విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్  ఆదివారంనాడు  యువతకు  లేఖ రాశారు. కష్టపడి చదువుకుని తమ కలలను సాకారం చేసుకోవాలని  మంత్రి యువతను కోరారు. వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా  తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ పనిచేస్తుందని కేటీఆర్  గుర్తు చేశారు.  

ALso REad:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

దేశంలో నవ శకానికి తెలంగాణ సర్కార్ నాంది పలికిందన్నారు.  ఇప్పటికే సుమారు రెండు లక్షల 25వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా దేశ చరిత్రలో సరికొత్తను లిఖించబోతుందని చెప్పడానికి తనకు  సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు.ఉద్యమకాలంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తుందని  కేటీఆర్  తెలిపారు. తమ మేనిఫెస్టోలో  ఇచ్చిన హామీ మేరకు 1లక్షా 35వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను మొదటిసారి అధికారంలోకి రాగానే భర్తీ చేసినట్టుగా  కేటీఆర్  గుర్తు  చేశారు. 

రెండోసారి అధికారంలోకి వచ్చాక 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత నిబద్ధతతో వేగంగా చేపట్టినట్టుగా  కేటీఆర్  వివరించారు. ఇప్పటికే సుమారు 32వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు.గురుకుల విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను అతి త్వరలో విడుదల చేయబోతున్నామని మంత్రి ప్రకటించారు.  ఉద్యోగాల భర్తీలో స్థానికులకే అధిక ప్రాధాన్యం దక్కాలన్న ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిని మరువలేమన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios