తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవలే గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజగా గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టుగా టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని పేర్కొంది. ఆబ్జెక్టివ్ టైప్‌లో పరీక్ష నిర్వహించనున్నట్టుగా తెలిపింది.

అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపింది. వివరణాత్మక నోటిఫికేషన్, వయస్సు, వేతన స్కేల్, విద్యార్హతలు, ఇతర వివరణాత్మక సూచనలు.. కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in లో అందుబాటులో ఉంచనున్నట్టుగా పేర్కొంది.

గ్రూప్-4లోని పోస్టులు..