టీఆర్ఎస్ తీరుపై జీవన్ రెడ్డి ధ్వజం

సీఎం కేసీఆర్ పాలనను వ్యతిరేకించే ప్రతివారిని తెలంగాణ ద్రోహులా టీఆర్ ఎస్ పార్టీ విమర్శిస్తోందని , ఇది ఎంతమాత్రం సరికాదని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.

ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరు మాట్లాడినా తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేయడం దారుణమన్నారు.

సోమవారం ఆయన కరీంగనర్ లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్, విమలక్కలను టీఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేయడం సరికాదని ధ్వజమెత్తారు.

తెలంగాణ కోసం ఏనాడు పోరాడని తలసాని, తుమ్మలకు సీఎం కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిందన్నారు. అభివృద్ది ఎందులోనూ జరగలేదన్నారు.

ఉద్యమ నాయకుడిని అని చెప్పుకునే కేసీఆర్ ఇప్పుడు ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టడం ఎందుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్క కుటుంబపాలనే నడుస్తోందని ఇది ఎంతోకాలం ఉండదని పేర్కొన్నారు.