జీవిత కాలం తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషి చేసిన మహనీయులు జయ శంకర్ సర్: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Hyderabad: ''తన జీవిత కాలం తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన మహనీయులు ఆచార్య జయ శంకర్ సర్.. ఆయన సేవలు మరువలేనివి'' అంటూ తెలంగాణ ఉద్య‌మ పోరాట నాయ‌కులు, స్ఫూర్తి ప్ర‌దాత జ‌య శంక‌ర్ స‌ర్ కు మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి ఘ‌న నివాళులు అర్పించారు. 
 

Jayashankar sir was a great person who worked for the spread of Telangana ideology throughout his life: Minister Vemula Prashanth Reddy RMA

Jayashankar Sir: ''తన జీవిత కాలం తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన మహనీయులు ఆచార్య జయ శంకర్ సర్.. ఆయన సేవలు మరువలేనివి'' అంటూ తెలంగాణ ఉద్య‌మ పోరాట నాయ‌కులు, స్ఫూర్తి ప్ర‌దాత జ‌య శంక‌ర్ స‌ర్ కు రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు ఘ‌న నివాళులు అర్పించారు. అలాగే, "కొంత మంది తెలంగాణ ఉద్యమంలో సానుభూతి పరులుగా ఉన్నారు. కొంత మంది పార్ట్ టైం ఉద్యమ కారులు ఉన్నారు. కొంతమంది వివిధ రాజకీయ పార్టీల వేదికల్లో ఫుల్ టైం ఉద్యమ కారులుగా ఉన్నారు. కానీ ఆచార్య జయశంకర్ సార్ తన జీవిత కాలం తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసారు" అని మంత్రి  అన్నారు.

ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మినిస్టర్ క్వార్టర్స్ లోని మంత్రి అధికారిక నివాసంలో జయశంకర్ సర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఉద్యమ సమయంలో కేసిఆర్ తో పాటు సుదీర్ఘ కాలంపాటు సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ప్రయాణంలో ఆచార్య జయశంకర్ తో మాట్లాడిన సందర్భాలను మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన ఎంతో మేధో సంపత్తి కల్గిన వ్యక్తి అయి ఉండి కూడా నిరాడంబర జీవితం గడిపారని అన్నారు. తెలంగాణలోని ఏ మూలన 20 మంది మీటింగ్ పెట్టుకుని పిలిచినా వెళ్లి ప్రసంగించే వారని,రాష్ట్ర ఏర్పాటు అనివార్యతను వివరించే వారని గుర్తు చేసుకున్నారు.

భావజాల వ్యాప్తి కోసం రైల్లో,బస్సులో ప్రయాణం చేశారని అన్నారు. ఒకసారి ఉద్యమ నాయకుడు కేసిఆర్ జయశంకర్ సర్ ను 20 మంది పెట్టుకున్న మీటింగ్ కు కూడా  వెళ్తున్నారు కదా దాని వల్ల ఏమైనా సార్ధకత లభించేనా అని అడిగారన్నారు. "చంద్రశేఖర్ రావు..నీలాంటి వాడు ఎవరో ఒకరు తెలంగాణ కోసం తెగించి కొట్లాడడానికి వస్తారని తెలుసు.. నీ లాంటి వారికి సహకారంగా, నీతో నడువడానికి ఓ వెయ్యి మంది నైనా సమీకరించాలన్న ఉద్దేశంతో ఎవరు పిలిచినా వెళ్లిన అని కేసిఆర్ గారితో అన్నారని" మంత్రి గుర్తు చేశారు. అంతటి ముందు చూపు కలిగిన వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అని కొనియాడారు. జయశంకర్ సార్ ఆశయాలకు అనుగణంగా.. ఆయన స్పూర్తితో ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన సాగుతోంది అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios