సీఆర్‌పీఎఫ్  ఐజీ లడ్డా  నివాసంలో  పనిచేసే  జవాన్  ఇవాళ   ఆత్మహత్య  చేసుకున్నాడు.  ప్రేమ విఫలం కావడంతో  ఆత్మహత్య  చేసుకున్నాడని  సమాచారం. 

హైదరాబాద్: సీఆర్‌పీఎఫ్ ఐజీ మహేష్ చంద్రా లడ్డా నివాసంలో పనిచేసే జవాన్ గురువారంనాడు ఆత్మహత్య చేసుకున్నారు. హైద్రాబాద్ బేగంపేటలోని చీకోటి గార్డెన్ వద్ద సీఆర్‌పీఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన సర్వీస్ రివాల్వర్ తో జవాన్ దేవేందర్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. దేవేందర్ కుమార్ ది ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం. దేవందర్ కుమార్ సీఆర్‌పీఎఫ్ ఐజీ మహేష్ చంద్ర లడ్డా నివాసంలో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రేమ వ్యవహరమే జవాన్ ఆత్మహత్యకు కారణంగా సమాచారం. దేవందర్ మృతదేహన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.