ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పూజలు నిర్వహించిన పవన్

Janasena chief pawan kalyan visits secunderabad ujjaini mahankali temple
Highlights

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొన్నారు. ఏపీ రాష్ట్ర పర్యటనలో ఉన్న  పవన్ కళ్యాణ్ అమ్మవారిని దర్శించుకొనేందుకు ఆదివారం నాడు హైద్రాబాద్‌కు వచ్చారు.
 


హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొన్నారు. ఏపీ రాష్ట్ర పర్యటనలో ఉన్న  పవన్ కళ్యాణ్ అమ్మవారిని దర్శించుకొనేందుకు ఆదివారం నాడు హైద్రాబాద్‌కు వచ్చారు.

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ దర్శించుకొన్నారు. పవన్ కళ్యాణ్  అమ్మవారిని దర్శించుకొనేందుకు వస్తున్నారనే విషయం తెలుసుకొన్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకొన్నారు.

ఆలయం వద్ద పవన్ అభిమానులను  నిలువరించేందుకు పోలీసులు  కష్టపడ్డారు. అమ్మవారిని దర్శించుకొన్న తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడి నుండి వెళ్లిపోయారు.  అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు  ఆలయం వద్దకు వచ్చారు. వీఐపీల తాకిడితో భక్తులు ఇబ్బందులు పడ్డారు.

పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆలయం పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున తోపులాట జరిగింది.  అమ్మవారిని దర్శించుకొన్న తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడి నుండి వెళ్లిపోయారు.  బోనాలను పురస్కరించుకొని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


 

loader