దివంగత ప్రజా గాయకుడు గద్దర్‌కు జనసేనాని పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. గద్దర్ తన చివరి క్షణాల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వం గురించి మాట్లాడినట్టు గుర్తు చేశారు. 

Gaddar: ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక దివంగత గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావు జయంతి సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. అనేక ప్రజా యుద్ధాల్లో ఆరితేరిన యోధుడు గద్దర్ అని జనసేన విడుదల చేసిన ప్రకటనలో పవన్ కొనియాడారు. పోరాటమే జీవితం, జీవితమే పోరాటంగా జీవిత ప్రయాణం గావించారని గుర్తు తెచ్చుకున్నారు.

ప్రజల మాటలను పాటలుగా మలిచి పాటలనే తూటాలుగా ఎక్కుపెట్టి జనం కోసం జనారణ్యంలో యుద్ధం చేసిన సైనికుడు గద్దర్ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాను ఎప్పుడు కలిసినా తమ్ముడా అంటూ పలకరించేవాడని, ఆ పిలుపు తన గుండెకు ఎంతో చేరువయ్యేదని వివరించారు. గద్దర్ చివరి క్షణాల్లో తన నాయకత్వం గురించి చెప్పాడని తెలిపారు.

Scroll to load tweet…

‘నా నాయకత్వం నేడు యువతకు అవసరం అని గద్దర్ చివరి క్షణాల్లో నాకు చెప్పిన మాలు నాలో సదా మారుమోగుతుంటాయి’ అని పవన్ కళ్యాణ్ జనసేన విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తావించారు. గద్దర్ గారి జయంతి సందర్భంగా, తన తరఫున, పార్టీ తరఫున ఇవే నివాళులు అని పేర్కొన్నారు.

Also Read: చకినాల ముక్క గొంతులో ఇరుక్కుని మంచిర్యాల వాసి మృతి

గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. రవీంద్ర భారతిలో ఈ రోజు జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి జూపల్లి క్రిష్ణారావు వెల్లడించారు. అలాగే.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహ ఏర్పాటుకూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.