యువత రాజకీయాల్లోకి రావాలి.. పవన్

janaseana president pawan kalyan inagurates largest national flag in NTR stadium
Highlights

అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్

యువత రాజకీయాల్లోకి రావాలని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ పిలుపునిచ్చారు. గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో అతి పెద్ద జాతీయ జెండాను పవన్ కళ్యాణ్  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. జాతీయ జెండా గొప్పతనాన్ని పవన్ ఈ సందర్భంగా వివరించారు.

జాతీయ జెండా అంటే ప్రతి ఒక్కరిదని పవన్ తెలిపారు. జాతీయ జెండాకు కులం, మతం, ప్రాంతం లేదని ఇది అందరిదన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులు స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.  జాతీయ జెండాలోని రంగులు సమైక్యతకు, సమగ్రతకు నిదర్శనమన్నారు. అనంతరం సభకు వచ్చినవారందరి చేత పవన్ ప్రమానం చేయించారు. ‘భారతీయుడైన నేను..’ అంటూ పవన్ ప్రమానం చేయించారు. పవన్ సభలో మాట్లాడుతున్నంత సేపు.. ఆయన అభిమానులు ‘‘ సీఎం.. సీఎం’’ అంటూ నినాదాలు హోరెత్తించడం గమనార్హం.

loader