అసెంబ్లీలో జానా, కేటీఆర్ మాటల యుద్ధం తాము తలుచుకుంటే ఉద్యమాన్ని అణిచివేసేవాళ్లమన్న జానా
తెలంగాణ కాంగ్రెస్ నేత, అసెంబ్లీ లో ప్రతిపక్ష నేత జానా రెడ్డి సభలో మరోసారి తనదైన శైలిలో ప్రభుత్వంతో మాటల యుద్ధానికి దిగారు.
సభలో ప్రసంగిస్తున్న కేటీఆర్ మా తెలంగాణ అనడంపై జానా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మా తెలంగాణ కాదు మన తెలంగాణ అనాలని సూచించారు.
అయితే కేటీఆర్ ఈ అంశం ఆధారంగా కాంగ్రెస్ పై ఎదుడుదాడికి దిగారు. 1969 నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉంది. వేలాది మంది ఇన్నేళ్లలో ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసినా ఆ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు.
మా తెలంగాణ అనే అంటామని స్పష్టం చేశారు.
దీంతో ఆగ్రహానికి గురైన జానా రెడ్డి... తాము తలుచుకుంటే తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేవాళ్లమని పేర్కొన్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్నామని, కావాలంటే ఉద్యమాన్ని అణిచి వేసేవాళ్లమని ఆవేశపూరితంగా ప్రసంగించారు.
ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలే కాదు కాంగ్రెస్ సభ్యులు కూడా కాస్త ఆయోమయానికి గురయ్యారు.
ఎంతైనా జానా రెడ్డి ఉన్నంత కాలం కాంగ్రెస్ కు ప్రత్యేకంగా మరో ప్రతిపక్ష పార్టీ అవసరమా చెప్పండి.
