ఉత్తం చిట్ చాట్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఎటూ పోడు

Janardhan Reddy will not leave Congress: Uttam
Highlights

కూచుకుళ్ల .. టిఆర్ఎస్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్

నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడని పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన టిఆర్ఎస్ లో చేరతారంటూ గత కొంతకాలంగా వార్తలొస్తున్న నేపథ్యంలో ఉత్తమ్ స్పందించారు. గాంధీభవన్ లో ఉత్తమ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెప్పినట్లు మీడియాకు చెప్పారు. దామోదర్ రెడ్డితో తాను పర్సనల్ గా మాట్లాడినట్లు చెప్పారు. టిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని దామోదర్ రెడ్డి తనతో చెప్పారని ఉత్తమ్ వివరించారు.

మిగతా అంశాలపైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆ వివరాలు చదవండి.

దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎవరు ఏమి తినాలి ఎవరు ఏ బట్టలు వేసుకోవాలి అనేది చర్చకు వచ్చింది. ముస్లిమ్స్ దేశంలో సురక్షితంగా ఉండాలంటే దేశంలో, రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. బీజేపీ, టీఆరెస్, ఎంఐఎం పార్టీకి ముస్లిమ్స్ ఓటు వేయవద్దు. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ముస్లిమ్స్ కి ఇఫ్తార్ విందులను వేదికగా చేసుకుని వివరిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇఫ్తార్ విందులకు హాజరవ్వాలనే బస్సు యాత్ర కు కాస్త విరామం ప్రకటించాం. 

loader