హత్య కేసులో జల్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ అరెస్ట్ .. హోమోసెక్సువల్ ముసుగులో...

హైదరాబాద్ జల్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ అబ్ధుల్లాను అరెస్ట్ చేశారు పోలీసులు.  బావజీర్ హత్య కేసులో అబ్ధుల్లాను అదుపులోకి తీసుకున్నారు. హోమోసెక్సువల్ ముసుగులో రౌడీషీటర్లు బావజీర్‌ను హత్య చేసినట్లుగా తేల్చారు. 

jalpally municipality chairman abdullah arrested in murder case ksp

హైదరాబాద్ జల్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ అబ్ధుల్లాను అరెస్ట్ చేశారు పోలీసులు. బావజీర్ హత్య కేసులో అబ్ధుల్లాను అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదంలో బావజీర్‌ను సుపారీ ఇచ్చి అబ్ధుల్లా హత్య చేయించాడని నిర్ధారించారు పోలీసులు. బావజీర్‌ను హోమోసెక్సువల్‌గా హత్య చేశారని చిత్రీకరించాడు అబ్ధుల్లా. ఈ కేసులో అబ్ధుల్లాతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న బావజీర్.. అబ్ధుల్లా భూ ఆక్రమణలను వెలుగులోకి తీసుకొచ్చాడు.

ఈ క్రమంలోనే బావజీర్‌ హత్యకు పథకం పన్నినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. పాతబస్తీలో కలకలం రేపిన ఈ హత్య కేసును ఛేదించారు పోలీసులు. హోమోసెక్సువల్ ముసుగులో రౌడీషీటర్లు బావజీర్‌ను హత్య చేసినట్లుగా తేల్చారు. జల్‌‌పల్లి మున్సిపల్ అభివృద్దికి సంబంధించి పలు కథనాలను ప్రసారం చేయడంతోనే బావజీర్‌ను చంపినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో పరారీలో వున్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios