కాంగ్రెస్‌కు షాక్‌లపై షాక్‌లు: టీఆర్ఎస్‌ వైపు జాజుల సురేందర్ చూపు

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 14, Mar 2019, 7:08 PM IST
jajula surendar may join in trs on march 19
Highlights

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడ  టీఆర్ఎస్‌లో చేరనున్నారు.ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ గూటికి చేరుతామని ప్రకటిస్తున్నారు


నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడ  టీఆర్ఎస్‌లో చేరనున్నారు.ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ గూటికి చేరుతామని ప్రకటిస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 19వ తేదీన కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలోనే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్  టీఆర్ఎస్‌లో చేరనున్నారని సమాచారం.

ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య,  హరిప్రియానాయక్‌లు టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. గురువారం నాడు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కేటీఆర్ తో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ లో చేరుతానని ఆయన ప్రకటించారు.

సబితా ఇంద్రారెడ్డి కూడ టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించారు.తాజాగా జాజుల సురేందర్ కూడ టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని వీడితే  కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కోల్పోయే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌కు మరో షాక్: టీఆర్ఎస్‌లోకి పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి


 

loader