అదనపు సౌకర్యాలు కల్పించిన జైలర్ గోపిరెడ్డి వరంగల్ కేంద్ర కారాగారం నుంచి బదిలీ వేటు

గ్యాంగ్ స్టర్ నయీం అనుచరులకు జైలులో సకల సౌకర్యాలు కల్పించిన ఓ జైలర్ పై అధికారులు ఆలస్యంగానైనా చర్య తీసుకున్నారు.

వరంగల్‌ కేంద్ర కారాగారంలో జైలర్ గా పనిచేస్తోన్న గోపి రెడ్డి అక్కడ జైలులో ఖైదీలుగా ఉన్న నయీం గ్యాంగ్‌కు చెందిన పాశం శ్రీను, సుధాకర్‌లకు సకల సదుపాయాలు కల్పించారు. ఈ క్రమంలో జైలర్‌ గోపి రెడ్డి ఖైదీల నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. చివరికి ఆ ఆరోపణలన్నీ నిజమేనని రుజువు కావడంతో జైలర్‌ గోపి రెడ్డిపై బదిలీ వేటు పడింది. అంతేకాదు, జైలర్ వ్యవహారంపై విచారణ జరపాలని నయీం కేసును విచారిస్తున్న సిట్‌కు లేఖ రాసినట్లు జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్ తెలిపారు.