ఆ అమ్మాయికి అమ్మా, నాన్న లేరు. అదే ఆమెకు షాపమైంది. అమ్మానాన్నలు లేకపోతేంది? ముగ్గురు అన్నలు, ముగ్గురు వదినలు ఉన్నారు. కానీ ఏం లాభం వాళ్లు నిత్యం నరకం చూపుతున్నారు. ఎంతగా నరకం చూపుతున్నారంటే ఈ చెల్లెమ్మ చేతులు వెనకకు మలిచి గొలుసుతో కట్టేసి తాళాలేసే వరకు చేశారు. ఇక వాళ్లు చేయాల్సిన పని ఒక్కటే మిగిలి ఉంది... అదేమంటే ఈ చెల్లెమ్మ ప్రాణాలు తీయడం ఒక్కటే ప్రస్తుతానికి మిగిలింది కావొచ్చు.

మానవత్వాన్ని ప్రశ్నించే ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో వాణినగర్ కు చెందిన చిట్యాల గీతకు తల్లిదండ్రులు లేరు. తోడబుట్టిన ముగ్గురు అన్నలు నారాయణ, రమేష్, శ్రీనివాస్ ఉన్నారు. వారితోపాటు ముగ్గురు వదినమ్మలు కూడా ఉన్నారు.

కానీ ముగ్గురుతోడ పుట్టిన ఆడపిల్లను కంటికి రెప్పలా చూసుకోవాల్సిందిపోయి ప్రతిరోజు ఆ పిల్లను కాల్చుకు తింటున్నారు. ఇంటిపని, వంటపని చేయిస్తూ సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. వదినలు, అన్నలు కలపి మరీ నరకం చూపుతున్నారు.

ఇక నరకంలో కొత్త టెక్నిక్ కనిపెట్టారు ఆ ముగ్గురు అన్నలు, ముగ్గురు వదినలు. అదేమంటే ఆ గీతను ఇంకా బాగా వేధించాలనుకున్నారు కావొచ్చు... అందుకే ఆమె చేతులను వెనకకు మలిచి గొలుసుతో రెండు చేతులు కట్టేసి తాళం వేశారు. అలా ఎందుకు చేశారంటే ఇంట్లో పని చేయడం మానేసి పారిపోయే ప్రయత్నం చేసిందట. దీనికి కోపమొచ్చిన అన్నా వదినలు ఆ పనిచేశారట.

ఆ అన్నా వదినల తీరు పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెల్లెమ్మతో బండెడు చాకిరీ చేయించుకుంటూ అది చాలదన్నట్లు చేతులకు బేడీలేయడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు అన్నా వదినలను విచారించి వదిలేసినట్లు తెలిసింది.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి

కెనడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వ్యక్తి మృతి

పాలమూరులో ఈతకు వెళ్లి ఇద్దరు పోరగాళ్లు మృతి

https://goo.gl/KywP1D