రాహుల్ సభతో టీఆరెస్ గుండెల్లో దడ మొదలయిందని అందుకే అమీన్ పూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ను కలెక్టర్ చేత బర్తరఫ్ చేయించారని  సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి అరోపించారు.

 

రాహుల్ సంగారెడ్డి విజయవంతమయినందుకే అమిన్ పూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ పై వేధింపులు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. “నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలతోనే  కక్ష పూరితంగా సర్పంచ్ ను కలెక్టర్ తో బర్తరఫ్ చేశారు. ఇది హరీష్ కు బ్లాక్ మెయిల్ రాజకీయం. .సర్పంచ్ పై  తొలగింపు ఉత్తర్వు ను ఎత్తివేయక పోతే, రేపు కలెక్టర్ ను గెరావ్ చేస్తాం,” అని జగ్గారెడ్డి హెచ్చరించారు.

 

సంగారెడ్డి లో సభ రాహుల్ గాంధీ సభ జరపాలనుకోవడం, దానిని విజయవంతం చేయడం వెనక ఉన్నది జగ్గారెడ్డే. ఈ సభలో రాహుల్ కెసిఆర్ కుటుంబపాలనను పెద్ద ఇష్యూ చేసేశారు.

 

ఈ విషయం ప్రస్తావిస్తూ, హరీష్ రావు చిల్లర రాజకీయాలు మానుకోవాలని, కాంగ్రెస్ సర్పించులను వేధించడం మానుకోవాలని జగ్గారెడ్డి సలహా ఇచ్చారు.

 

ఇక, అమీన్పూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ కక్షతోనే రాష్ట్ర మంత్రి హరీశ్ రావు  తనను రిమూవ్ చేయించారని ఆరోపించారు. “గతంలో తనను టీఆరెస్ లోకి రావాలని వత్తిడి చేశారు..తాను కాంగ్రెస్ లో ఉన్నందుకు, రాహుల్ సభ తర్వాత వేధింపులు మొదలుపెట్టారు,” అని అన్నారు. అమిన్ పుర్ భూముల ఆక్రమాలలో నాతప్పేమి లేదు.

 

 

.