Asianet News TeluguAsianet News Telugu

మనుషుల అక్రమరవాణా: 3 రోజుల పోలీసు కస్టడీకి జగ్గారెడ్డి

మనుషుల అక్రమ రవాణా కేసులో చంచల్‌గూడ జైలు నుండి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని  పోలీసులు కస్టడీకి తీసుకొన్నారు.  భారీ బందోబస్తు నడుమ జగ్గారెడ్డిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొన్నారు.

jagga reddy taken into police custody from chanchalguda jail
Author
Hyderabad, First Published Sep 19, 2018, 2:56 PM IST

హైదరాబాద్: మనుషుల అక్రమ రవాణా కేసులో చంచల్‌గూడ జైలు నుండి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని  పోలీసులు కస్టడీకి తీసుకొన్నారు.  భారీ బందోబస్తు నడుమ జగ్గారెడ్డిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొన్నారు.

మనుషుల అక్రమ రవాణా కేసులో కాంగ్రెసు నేత, మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డిని ఈ నెల 11వ, తేదీన పోలీసులు అరెస్టు చేశారు. 2004లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నకిలీ డాక్యుమెంట్లను సమర్పించి.. భార్యాపిల్లలుగా పేర్కొంటూ మరో ముగ్గురు వ్యక్తులను అమెరికాకు తీసుకుని వెళ్లారని అభియోగాలున్నాయి. జగ్గారెడ్డి 2004లో తన అధికారిక లెటర్‌ ప్యాడ్‌పై ప్రాంతీయ పాస్‌పోర్టుఅధికారికి లేఖ రాశారని పోలీసులు చెబుతున్నారు.

ఈ కేసులో జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు.ఈ కేసులో అరెస్టైన జగ్గారెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. చంచల్‌గూడ జైలులో ఉన్న జగ్గారెడ్డిని మూడు రోజుల కస్టడీ కోరుతూ  పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.దీంతో బుధవారం నాడు జగ్గారెడ్డిన చంచల్‌గూడ జైలు నుండి పోలీసులు  తమ కస్టడీకి తీసుకొన్నారు. మనుషుల అక్రమ రవాణా కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు పోలీసులు జగ్గారెడ్డిని కస్టడీలోకి తీసుకొన్నారు. 

ఈ వార్తలు చదవండి

మనుషుల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి అరెస్టు

తప్పించుకునేందుకు జగ్గారెడ్డి ఎత్తు: సంగారెడ్డి బంద్ కు పిలుపు

మాకు పాస్‌పోర్టులే లేవు: జగ్గారెడ్డి భార్య నిర్మల

 

Follow Us:
Download App:
  • android
  • ios