హైదరాబాద్: అమెరికా వీసా స్టాంపింగు నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెసు నేత జగ్గారెడ్డి ఎత్తు వేశారని పోలీసులు అంటున్నారు. తన వీసా పోయిందంటూ ఆయన 2009లో ఫిర్యాదు చేశారని అన్నారు. కొత్త వీసా కోసం దరఖాస్తు చేశారని పోలీసులు అంటున్నారు. 

జగ్గారెడ్డిని నార్త్ జోన్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణ అనంతరం మంగళవారం సికింద్రాబాదు కోర్టులో ఆయనను హాజరు పరుస్తారు. ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు వారం రోజుల కస్టడీకి పిటిషన్‌ వేయనున్నట్లు పోలీసులు తెలిపారు. 

మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసు కావడంతో.. సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ (సీసీఎ్‌స)కు బదిలీ చేసే అవకాశాలున్నాయని, దీనిపై ఒకటి రెండు రోజుల్లో నగర పోలీసు కమిషనర్‌ నిర్ణయం తీసుకుంటారని పోలీసు అధికారులు అంటున్నారు. 

కాగా, జగ్గారెడ్డి అరెస్టుకు నిరసనగా కాంగ్రెసు నాయకులు మంగళవారంనాడు సంగారెడ్డి బంద్ కు పిలుపునిచ్చింది. కాంగ్రెసు నాయకులు డిజిపిని కలిసి జగ్గారెడ్డిని విడుదల చేయాలని కోరారు. 

ఈ వార్తాకథనం చదవండి

మనుషుల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి అరెస్టు