బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నిందితుడిగా వున్న భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం. ఆయనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. 

అయితే ఈ కేసుకు సంబంధించి జగత్ విఖ్యాత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందు చేత అతనికి ముం‍దస్తు బెయిల్‌ మంజూరు చేయొద్దని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో కీలక నిందితుడైన జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. 

Also Read:బోయిన్‌పల్లి కిడ్నాప్: జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు

కాగా, ఇదే కేసులో అరెస్టు అయిన మరో 15 మంది నిందితులు కూడా సికింద్రాబాద్ కోర్టులోనే బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా, అన్ని పిటీషన్లను వచ్చే శుక్రవారం విచారణ చేస్తామని కోర్టు పేర్కొంది.

ఇదే కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టై ఇటీవలే విడుదలయ్యారు. ఆమె భర్త భార్గవ్ రామ్, జగత్  విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీను, చంద్రహాస్‌లు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ కేసులో దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని జగత్ విఖ్యాత్ రెడ్డి తరపు న్యాయవాది ప్రకటించారు