కరీంనగర్: అమ్మాయి ట్రాప్‌లో పడి ఆర్మీ సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేశాడు ఆర్మీలో పనిచేసే రాకేష్ అనే వ్యక్తి. ఈ వ్యక్తికి జగిత్యాల జిల్లాకు చెందిన లింగన్న అనే వ్యక్తి డబ్బులు పంపడంపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు మంగళవారం నాడు విచారణ జరిపారు.

Also read:ఉగ్రవాదులతో లింక్: జగిత్యాల యువకుడిని అదుపులోకి తీసుకొన్న కాశ్మీర్‌ పోలీసులు

జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీలో రాకేష్  పనిచేసేవాడు.రాకేష్ కు అనిత అనే అమ్మాయి పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయి  రాకేష్ నుండి ఆర్మీ క్యాంపుకు సంబంధించిన లోకేషన్ మ్యాప్ ఇతర వివరాలను సేకరించింది. 

జమ్మూ కాశ్మీర్ జిల్లా ఆర్నియా పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై కేసు నమోదైంది.  రాకేష్ కు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలానికి కుస్థాపూర్ గ్రామానికి చెందిన  సరికేల లింగన్న అనే వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరి 13న  రాకేష్ కు రూ. ఐదువేలు పంపాడు. అదే నెల 20వ తేదీన రూ. 4 వేలు పంపాడు. బ్యాంకు ఆధారాలను కూడ జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారులు సేకరించారు. లింగన్నను మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో జమ్మూ నుండి వచ్చిన పోలీసులు విచారించారు.