తెలంగాణలో కెసిఆర్ ఫొటోల మీద పాలాభిషేకాల కుంభవృష్టి ఇంకా కొనసాగుతూనే ఉంది. కెసిఆర్ ప్రగతిభవన్ లో ప్రకటన జారీ చేయడం వెంటనే గలాబీ శ్రేణులు రంగంలోకి దిగి పాలాభిషేకాలు చేపడం తెలంగాణలో గత మూడేళ్లుగా జరుగుతూనే ఉంది.
తాజాగా రెండుచోట్ల పాలాభిషేకాలు జరిగాయి. కాంట్రాక్టు లెక్చరర్స్ వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేయడంతో కాంట్రాక్టు లెక్చరర్లు నల్లగొండలో పాలాభిషేకం చేశారు. తమ వేతనాలను భారీగా పెంచడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.
తాజాగా నిజామాబాద్ జిల్లాలోనూ కెసిఆర్ పై పాల వర్షం కురిసింది. రివర్స్ పంపిగ్ తో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా రీరామ సాగర్ ప్రాజెక్టు నింపే ప్రాజెక్టు కు కార్యరూపం ఇచ్చి 1065 కోట్లతో టెండర్లు పిలిచినందున సిఎం కెసిఆర్ కు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి పాలాభిషేకం చేశారు.
200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా వరుదల కాలువలో నీటిని తీసుకొచ్చి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నింపి రైతులను ఆదుకోవాలని సిఎం సంకల్పించడం పట్ల ఈ పాలాభిషేకానికి దిగారు ప్రశాంత్ రెడ్డి.
మొత్తానికి తెలంగాణలో రోజుకోసారి రోజుకోచోట కెసిఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకాలు జరగుతుండడంతో గులాబీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
