సెప్టెంబర్ 14న జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో నిర్వహించే గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అలయెన్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు నిర్వాహకులు ఆహ్వానం పలికారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. ఈ ఏడాది సెప్టెంబర్ 14న జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో నిర్వహించే గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అలయెన్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాల్సిందిగా కేటీఆర్‌కు నిర్వాహకులు ఆహ్వానం పలికారు. సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టార్ పాలసీ కోసం పనిచేస్తున్న నిపుణులతో కూడిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ కేటీఆర్‌కు ఈ ఆహ్వానం పంపింది.
ALso Read: కాంగ్రెస్ రాబందుల పార్టీ.. రాహుల్‌కు తెలిసింది పబ్బులు, క్లబ్బులే : కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
జీటీఐపీఏ వాణిజ్యం, ప్రపంచీకరణ, ఆవిష్కరణల ద్వారా మానవాళికి ప్రయోజనాలు అందించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్ధిక, వాణిజ్య, ఆవిష్కరణలకు సంబంధించిన సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడమే ఈ సదస్సు ముఖ్య లక్ష్యం. జర్మనీలో జరిగే ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రపంచంలోని మేధావులు, శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. వ్యాపార, ప్రభుత్వ, విద్య, విధాన రూపకల్పనకు చెందిన ప్రముఖులను నిర్వాహకులు ఆహ్వానించారు.
