Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాదులో ఐటీ సోదాలు.. కాంగ్రెస్ నాయకురాలు పారిజాత, బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇళ్లలో తనిఖీలు..

హైదరాబాద్ లో కాంగ్రెస్ నాయకురాలి ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. 

IT searches Congress leader Parijata's house in Hyderabad - bsb
Author
First Published Nov 2, 2023, 6:56 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాదులో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నాయకురాలు పారిజాత ఇళ్లలో సోదాలు. చిగిరింత పారిజాత నరసింహారెడ్డి మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. బాలాపూర్ లోని పారిజాత నివాసంలో ఉదయం 5 గంటల నుంచి సోదాలు చేస్తున్నారు. ఏక కాలంలో ఆమెకు సంబంధించిన 10 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. పారిజాత బడంగ్పేట్ మేయర్ గా ఉన్నారు. 

ఐటీ అధికారులు పారిజాత కూతురి ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో పారిజాత, ఆమె భర్త నర్సింహా రెడ్డిలు హైదరాబాద్ లో లేరు.  పారిజాతకు సంబంధించన ఇల్లు, కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు  బాలాపూర్ లడ్డూను వేలంలో దక్కించుకున్న బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కేఎల్ఆర్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ లో రాజకీయ నేతల ఇళ్లల్లో ఐటి సోదాలు కలకలం రేపుతున్నాయి. 

వీరిద్దరితో పాటు పలువురు రాజకీయనాయకుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇలా ఐటీ దాడులు నిర్వహించడం ఇదే తొలిసారి. వాహనాల్లో తరలిస్తున్న డబ్బును పట్టుకోవడం, సీజ్ చేయడం ఈ సమయంలో జరుగుతుంది. కానీ ఇలా ఎన్నికల సన్నాహాల్లో ఉన్న రాజకీయనాయకుల ఇళ్లలో తనిఖీలు ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios