గాలి కూతురు వివాహ ప్రచారం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగినంత కాలం ఐటి కళ్ళు మూసుకుని కూర్చుని తీరిగ్గా దాడులు చేయట చూస్తుంటే ఏదో మొక్కుబడిగా దాడులు జరిపినట్లుందని అనుకుంటున్నారు.
మైనింగ్ కింగ్ గాలి జనార్ధనరెడ్డి కుటుంబంపై ఐటి దాడులా? ఆశ్చర్యంగా ఉంది. కూతురు బ్రాహ్మణి వివాహం అయిన ఐదు రోజుల తర్వాత ఐటి దాడులు జరపటం పట్ల పలువురు విస్తుపోతున్నారు. ఈనెల 16వ తేదీన వివాహం అయిపోయిన తర్వాత దాడులు జరిపితే గాలి వద్ద ఏమి దొరుకుతుందనుకున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. వివాహానికి ముందు దాడులు జరిపితే ఏమన్నా దొరికే అవకాశం ఉందన్న సంగతి అధికారులకు తెలియదా? గాలి కూతురు వివాహ ప్రచారం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగినంత కాలం ఐటి కళ్ళు మూసుకుని కూర్చుని తీరిగ్గా దాడులు చేయట చూస్తుంటే ఏదో మొక్కుబడిగా దాడులు జరిపినట్లుందని అనుకుంటున్నారు.
తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను ప్రపంచానికి పరిచయం చేయటంతోనే గాలి ఇంట వివాహం దేశంలో సంచలనం రేపింది. అప్పటి నుండి వివాహ ఏర్పాట్లపైన, ఏర్పాట్లు జరుగుతున్నతీరు తెన్నులపైన పుంకానుపుంకాలుగా మీడియా ప్రత్యేక కథనాలు వెలువరించింది. అందులోనూ పెద్ద నోట్ల రద్దు నేపధ్యంలో జరిగిన వివాహం కావటంతో అందరిలోనూ సహజంగానే ఆశక్తి నెలకొంది.
అయితే వెలుగు చూసిన విషయాల ప్రకారం దాదాపు ఆరు మాసాల క్రితమే గాలి ఒక ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి వివాహ ఏర్పట్ల బాధ్యత అప్పగించినట్లు సమాచారం. అందుకుగాను తన ఆస్తులను కుదవపెట్టి నగదును అడ్వాన్సులుగా చెల్లించినట్లు తెలిసింది.అందుకనే పెద్ద నోట్ల రద్దు అంశం గాలి ఇంట వివాహానికి ఎటువంటి ఆటకం కలిగించలేదు.
మైనింగ్ లో అక్రమాలకు పాల్పడ్డారంటూ గాలిపై సిబిఐ కేసు పెట్టి జరుపుతున్న విచారణలో అక్రమాల ఆరోపణలపై పెద్దగా ఆధారాలను ఏమీ రాబట్టలేదని సమాచారం. అటువంటిది ఇపుడు ఐటి దాడులు చేస్తే ఏమి ఆధారాలు దొరుకుతుందో అధికారులకే తెలియాలని పలువురు పెదవి విరుస్తున్నారు.
