తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సముద్ర ఉత్పత్తుల సంస్థ అవంతి అగ్రో ఫీడ్స్‌పై శుక్రవారం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖతో పాటు రెండు రాష్ట్రాల్లోని పదిహేను చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.

అవంతి ఛైర్మన్‌తో పాటు డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనితో పాటు ట్రెండ్ సెట్ బిల్డర్స్ కంపెనీలపైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సంస్థకు సంబంధించి ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. 

ప్రముఖ సినీ నిర్మాత, దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ స్వగ్రామమైన కృష్ణాజిల్లా పెదగొన్నూరులోని ఆయన నివాసంలో గురువారం ఆదాయపు పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు.

Also Read:Breaking: నటి రాశి ఇంటిపై ఐటీ దాడులు..!

ఆదాయపు పన్నుశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం శ్వేత ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఇంకా ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరవాల్సి వుందని, నారాయణ  హైదరాబాద్‌లో ఉన్నందున గ్రామానికి చేరుకోగానే శుక్రవారం వీటిని తెరిచి సోదాలు జరుపుతామని అధికారులు తెలిపారు.

అలానే హైదరాబాద్, విజయవాడల్లోని నారాయణ కార్యాలయాలు, నివాసాల్లోనూ సోదాలు జరిగినట్లు సమాచారం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో పలు హిట్ చిత్రాలను రూపొందించారు. హలో బ్రదర్‌, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు,  సంతోషం, రాఖీ, దొంగాట, క్షణక్షణం వంటి చిత్రాలను ఇలా ఎన్నో సినిమాలను రూపొందించారు. ఈ మధ్యకాలంలో మాత్రం ఆయన నిర్మాతగా సినిమాలు తీసిన దాఖలాలు లేవు. 

Also Read:మహేష్ బాబు పార్టనర్ పై ఐటీ దాడులు.. శేఖర్ కమ్ములకి షాక్..?

నటి రాశి సోదరుడు 'కలర్ సంస్థ' అధినేత అయిన విజయ్ కృష్ణ ఇల్లు, ఆఫీస్ లతో పాటు రాశి ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు జరిపారు. హైదరాబాద్ కలర్స్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్  లిమిటెడ్ కంపనీలో అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈ కంపనీ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న మొత్తం నలభై లొకేషన్లలో ఐటీ సోదాలు నిర్వహించారని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు మెట్రో నగరాలలో కలర్స్ ఆఫీస్ లలో సోదాలు చేయడం సంచలనంగా మారింది. ఈ కంపనీకి సంబంధించిన డాక్యుమెంట్లను, రకరకాల బిల్లుల్ని ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారని తెలిసింది.

విజయ్ కృష్ణ దేవుల నడిపిస్తోన్న ఈ కంపనీలో బ్యూటీ, ఫిట్నెస్, వెయిట్ లాస్ తదితర రంగాల్లో సేవలు అందిస్తున్నారు. విజయ్ కృష్ణతో పాటు ఆయనకి పార్టనర్ గా ఉన్న రాయుడు అలానే రాశి ఇళ్లల్లో ఐటీ దాడులు నిర్వహించారని తెలుస్తోంది. ఆర్ధిక వ్యవహారాలు, టాక్స్ లకు సంబంధించిన చెల్లింపుల్లో తేడా వచ్చిందని ఐటీ అధికారులు చెబుతున్నారు.