ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రాశి ప్రస్తుతం తల్లి పాత్రలు పోషిస్తోంది. తాజాగా ఈ నటి ఇంట్లో ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. నటి రాశి సోదరుడు 'కలర్ సంస్థ' అధినేత అయిన విజయ్ కృష్ణ ఇల్లు, ఆఫీస్ లతో పాటు రాశి ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు జరిపారు. హైదరాబాద్ కలర్స్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్  లిమిటెడ్ కంపనీలో అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈ కంపనీ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న మొత్తం నలభై లొకేషన్లలో ఐటీ సోదాలు నిర్వహించారని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు మెట్రో నగరాలలో కలర్స్ ఆఫీస్ లలో సోదాలు చేయడం సంచలనంగా మారింది. ఈ కంపనీకి సంబంధించిన డాక్యుమెంట్లను, రకరకాల బిల్లుల్ని ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారని తెలిసింది.

''ఆ కామాంధుడు నన్ను కూడా విడిచిపెట్టలేదు..'' సింగర్ కామెంట్స్!

రాశి సోదరుడు విజయ్ కృష్ణ దేవుల నడిపిస్తోన్న ఈ కంపనీలో బ్యూటీ, ఫిట్నెస్, వెయిట్ లాస్ తదితర రంగాల్లో సేవలు అందిస్తున్నారు. విజయ్ కృష్ణతో పాటు ఆయనకి పార్టనర్ గా ఉన్న రాయుడు అలానే రాశి ఇళ్లల్లో ఐటీ దాడులు నిర్వహించారని తెలుస్తోంది. ఆర్ధిక వ్యవహారాలు, టాక్స్ లకు సంబంధించిన చెల్లింపుల్లో తేడా వచ్చిందని ఐటీ అధికారులు చెబుతున్నారు.

ఆ కారణంగానే సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుతం కలర్స్ కంపనీ మెషినరీతో పాటుగా డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా కలర్స్ కి 49 బ్రాంచీలు ఉన్నాయి.

దాదాపు 1500 మంది పని చేస్తున్నారు. పది లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ కంపనీపై పలు ఆరోపణలు వచ్చాయి. రంభ, రాశి వంటి నటీమణులు కలర్స్ కోసం చేసిన యాడ్స్ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాయని కొందరు కేసులు కూడా వేశారు. దీంతో వారి యాడ్స్ ని నిలిపి వేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది.