ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ కార్యాలయాలపై మంగళవారం ఐటీ దాడులు జరిగాయి.  ఈ సంస్థఅధినేతలు నారయణదాస్‌ (తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్), సునీల్‌ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల ఇళ్లల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవలే సునీల్ నారంగ్.. మహేష్ బాబుతో కలిసి ఏఎంబీ మాల్ ని నిర్వహించారు.

 

ఐటీ అధికారులుఏఎంబీకి చెందిన ఆఫీస్ లలో కూడా తనిఖీలు చేపట్టారు. ఏషియన్ సినిమాస్ సంస్థకి హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, భద్రాచలం, సిద్ధిపేట్, కరీంనగర్, మంచిర్యాల్ లలో కలిపి మొత్తం 8 మల్టీప్లెక్స్ లు, 12 సినీప్లెక్స్ లు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థకి 80కి పైగా సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. నైజాంలో భారీగా చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి బలమైన డిస్ట్రిబ్యూషన్ కంపనీగా పేరు గాంచింది.

(Also Read) ఏషియన్ సునీల్ నారంగ్ ఇళ్లలో ఐటీ దాడులు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తో కలిసి హైదరాబాద్ లో అమీర్ పేట్.. సత్యం థియేటర్ జంక్షన్ వద్ద మరో భారీ మల్టీప్లెక్స్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలానే మరికొన్ని థియేటర్లను నిర్మించే ప్లాన్ లో కూడా ఉన్నారు. ఇప్పటివరకు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న ఈ సంస్థ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.

 

ఈ క్రమంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించడానికి సిద్ధమైంది. ఇందులో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఏషియన్ సంస్థ, సునీల్ నారంగ్ పై ఐటీ సోదాలు జరగడంతో శేఖర్ కమ్ముల సినిమాపై ప్రభావం చూపుతుందనే సందేహాలు నెలకొన్నాయి.