తెలంగాణలో ఐటీ దాడులు (it raids) కలకలం రేపాయి. రాష్ట్రంలోని నాలుగు ఇన్‌ఫ్రా కంపెనీలలో (infra companies) బుధవారం ఏకకాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్యాక్స్ కట్టని ఆదాయానికి సంబంధించి పలు వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. 

తెలంగాణలోని నాలుగు ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. కేఎన్ఆర్ ఇన్‌ఫ్రా (knr infra), గజా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (gaja engineering) , ఆర్‌వీఆర్ (Rvr) , జీవీపీఆర్ కంపెనీల్లో (gvpr) తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో రూ.150 కోట్ల లావాదేవీలకు ట్యాక్స్ కట్టలేదని కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అంగీకరించింది. ఈ కంపెనీకి నర్సింహారెడ్డి, జలంధర్ రెడ్డిలు ఛైర్మన్‌లుగా వుంటున్నారు. అటు రూ.50 కోట్ల లావాదేవీలకు సంబంధించి ట్యాక్స్ కట్టలేదని అంగీకరించింది గజా ఇంజనీరింగ్ సంస్ధ. మరోవైపు ఆర్‌వీఆర్ సంస్థ రూ.60 కోట్లు ట్యాక్స్ కట్టలేదని ఐటీ అధికారుల ముందు అంగీకరించింది.