లాకర్ల తాళాలను తీసుకెళ్లిన ఐటీ అధికారులు... డొనేషన్లపైనే అనుమానాలు, సోమవారం మల్లారెడ్డికి పిలుపు

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి , ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించిన వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకం రేపింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డితో పాటు 14 మందికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. 

it officials seized bank lockers keys from telangana minister malla reddy and his relatives

మంత్రి మల్లారెడ్డి , కుటుంబ సభ్యుల బ్యాంక్ లాకర్ల తాళాలను ఐటీ శాఖ అధికారులు తీసుకెళ్లారు. రేపు లేదా ఎల్లుండి లాకర్లను ఓపెన్ చేయనున్నారు. రూ.15 కోట్ల నగదుకు సంబంధించిన పత్రాలు కూడా తీసుకెళ్లారు ఐటీ అధికారులు. మరోవైపు మంత్రి మల్లారెడ్డితో పాటు 14 మందికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలని ఐటీ శాఖ ఆదేశించింది. మల్లారెడ్డి, ఆయన సోదరులు, కుమారులు, అల్లుడు, విద్యా సంస్థల సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. ఆస్తులు, ఆర్ధిక లావాదేవీల వ్యవహారాలపై విచారించనున్నారు ఐటీ శాఖ అధికారులు. విద్యా సంస్థల్లో డొనేషన్లపైనే ప్రధానంగా ఆరా తీసే అవకాశం వుంది. అయితే ఐటీ శాఖ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని మంత్రి మల్లారెడ్డి ముందే తెలిపిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే.. రెండు రోజుల పాటు జరిగిన సోదాల్లో మల్లారెడ్డి  నివాసంలో రూ. 6 లక్షలు, మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో రూ. 12 లక్షలు, చిన్న కుమారుడు భద్రా రెడ్డి ఇంట్లో రూ. 6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడు మర్రి  రాజశేఖర్ రెడ్డి ఇంట్లో రూ. 3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ. 1.5 కోట్లు, త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ. 2 కోట్లు, రఘునందన్ రెడ్డి ఇంట్లో రూ. 2 కోట్లు, సుధీర్ రెడ్డి నివాసంలో రూ. కోటి, ప్రవీణ్ కుమార్ ఇంట్లో రూ. 2.5 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. 

ALso REad:మంత్రి మల్లారెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు.. విచారణకు రావాల్సిందిగా నోటీసులు.. ఎంత నగదు దొరికిందంటే..?

మరోవైపు మల్లారెడ్డి నివాసం దగ్గర బుధవారం గత అర్దరాత్రి హై డ్రామా చోటుచేసుకుంది. దీనిపై ఐటీ అధికారులు, మల్లారెడ్డి  ఒకరిపై ఒకరు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఐటీ అధికారిపై బోయిన్‌పల్లి పీఎస్‌లో మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. అధికారులు తప్పుడు సమాచారంతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. మహేందర్ రెడ్డితో బలవంతంగా సంతకం చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను ఐటీ అధికారులు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios