Asianet News TeluguAsianet News Telugu

మంత్రి మల్లారెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు.. విచారణకు రావాల్సిందిగా నోటీసులు.. ఎంత నగదు దొరికిందంటే..?

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. రెండు రోజులుగా కొనసాగిన తనిఖీలు ఈ ఉదయం పూర్తయ్యాయి. 

IT officials ends raids at Malla Reddy residences and issues notice to him
Author
First Published Nov 24, 2022, 9:42 AM IST

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. రెండు రోజులుగా కొనసాగిన తనిఖీలు ఈ ఉదయం పూర్తయ్యాయి. మల్లారెడ్డి నివాసంలో సోదాలు ముగిసిన అనంతరం ఆయనకు ఐటీ అధికారులు నోటీసులు జారీచేశారు. సోమవారం తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. 

సోదాల్లో మల్లారెడ్డి  నివాసంలో రూ. 6 లక్షలు, మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో రూ. 12 లక్షలు, చిన్న కుమారుడు భద్రా రెడ్డి ఇంట్లో రూ. 6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడు మర్రి  రాజశేఖర్ రెడ్డి ఇంట్లో రూ. 3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ. 1.5 కోట్లు, త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ. 2 కోట్లు, రఘునందన్ రెడ్డి ఇంట్లో రూ. 2 కోట్లు, సుధీర్ రెడ్డి నివాసంలో రూ. కోటి, ప్రవీణ్ కుమార్ ఇంట్లో రూ. 2.5 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. 

Also Read: మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో సోదాలు: అర్థరాత్రి హైడ్రామా, పోలీసులకు ఫిర్యాదులు

మరోవైపు మల్లారెడ్డి నివాసం దగ్గర గత అర్దరాత్రి హై డ్రామా చోటుచేసుకుంది. దీనిపై ఐటీ అధికారులు, మల్లారెడ్డి  ఒకరిపై ఒకరు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఐటీ అధికారిపై బోయిన్‌పల్లి పీఎస్‌లో మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. అధికారులు తప్పుడు సమాచారంతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. మహేందర్ రెడ్డితో బలవంతంగా సంతకం చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను ఐటీ అధికారులు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. 

మరోవైపు మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి తనిఖీలకు సహకరించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ల్యాప్‌టాప్‌ను పరిశీలిస్తుండగా తమ వద్ద నుంచి ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లారని, విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. అధికారులను మల్లారెడ్డి దూషించి ల్యాప్‌టాప్ లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios