కేటీఆర్ ఫన్నీ ట్వీట్, ఆ పిల్లి అలా కూడా పాలు తాగొచ్చా?

IT minister ktr funny tweet
Highlights

ఓ విద్యార్థి చేసిన స్మార్ట్ హోంవర్క్ పై ట్వీట్...

ట్విట్టర్ లో ఎప్పుడూ ప్రజా సమస్యలపై, వాటి పరిష్కారాలపై బిజిగా ఉండే తెలంగాణ ఐటీ, పురపాల మంత్రి కేటీఆర్ తాజాగా ఓ పన్నీ ఫోటోను పోస్ట్ చేశారు. ఓ విద్యార్థి  తన తెలివితేటలను ఎలా ప్రదర్శించిందో చూడండి అంటూ ఓ ఫోటోను తన ట్వీట్ కు జత చేశాడు. ఇలా తన హాస్య చతురతను కేటీఆర్ చాటుకున్నారు.

మంత్రి కేటీఆర్ తాజాగా ఓ విద్యార్థి హోం వర్క్ రిపోర్ట్‌ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకి సరదాగా ఇలా కామెంట్ పెట్టారు. ''జీవితంలో షార్ట్‌కట్స్ లేవని ఎవరు చెప్పారు? ఈ చిన్నారి ఎంత స్మార్ట్ గా షార్ట్ కట్ కనుక్కుందో చూడండి. అలా కొత్తగా ఆలోచించి షార్ట్ కట్స్ కనుకున్న విద్యార్థే కాదు ఆమెను ప్రోత్సహించిన ఆ టీచర్ కూడా అంతే స్మార్ట్‌'' అంటూ ట్వీట్ చేశారు.

ఇంతకూ ఆ విద్యార్థి, టీచర్ ని కేటీఆర్ అంత ప్రత్యేకంగా ఎందుకు ప్రశంసించారో తెలుసుకోవాలంటే కింద కేటీఆర్ చేసిన ట్వీట్ యదావిధిగా ఉంది. చూడండి. 

 


 

loader