రైలులో హత్యకు గురైన హైదరాబాదీ కుటుంబానికి ప్ర‌భుత్వ ఉద్యోగం, డ‌బుల్ బెడ్ రూం ఇల్లు: కేటీఆర్

Hyderabad: రైలులో కాల్పుల ఘ‌ట‌న నేప‌థ్యంలో ప్రాణాలు కోల్పోయిన హైద‌రాబాద్ వాసి సైఫుద్దీన్ కుటుంబాన్ని అదుకుంటామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, డ‌బుట్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. జైపూర్ -ముంబ‌యి ఎక్స్ ప్రెస్ లో జరిగిన వాగ్వాదం మతపరంగా మలుపు తిరిగిన తర్వాత సైఫుద్దీన్ సహా నలుగురిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ కాల్చి చంపాడని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 
 

IT minister KTR announces govt job, 2BHK for train firing victim's kin RMA

Telangana IT minister KTR: రైలు కాల్పుల ఘ‌ట‌న నేప‌థ్యంలో ప్రాణాలు కోల్పోయిన హైద‌రాబాద్ వాసి సైఫుద్దీన్ కుటుంబాన్ని అదుకుంటామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, డ‌బుట్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. జైపూర్ -ముంబ‌యి ఎక్స్ ప్రెస్ లో జరిగిన వాగ్వాదం మతపరంగా మలుపు తిరిగిన తర్వాత సైఫుద్దీన్ సహా నలుగురిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ కాల్చి చంపాడని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. హత్యకు గురైన హైదరాబాద్ వాసి సయ్యద్ సైఫుద్దీన్ కుటుంబాన్ని అదుకుంటామ‌నీ, మృతుని భార్య, కుటుంబాని డ‌బుల్ బెడ్ రూమ్ ఇల్లుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని  తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు (కేటీఆర్) హామీ ఇచ్చారు. కాగా, జూలై 31, సోమవారం ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్చి చంపిన ముగ్గురు ముస్లిం ప్రయాణికుల్లో హైద‌రాబాద్ లోని బజార్ఘాట్ నివాసి సయ్యద్ సైఫుద్దీన్ ఒకరు. జైపూర్-ముంబ‌యి ఎక్స్‌ప్రెస్‌ రైలులో జరిగిన వాగ్వాదం మతపరమైన మలుపు తిరిగిన తర్వాత ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ తన సీనియర్ సహా నలుగురిని కాల్చి చంపాడు.

ప్రస్తుతం మూడు రోజుల పాటు జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్రుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి మేరకు కేటీఆర్ ఈ ప్రకటన చేశారు. బాధితురాలి ముగ్గురు కుమార్తెల‌ ఒక్కొక్కరి పేరుపై పార్టీ తరఫున రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున మొత్తం రూ. 6 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తామ‌ని ప్రకటించారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios