ఇస్రో మరో ప్రయోగం విజయవంతం

First Published 23, Jun 2017, 11:38 AM IST
isro launches pslv c38 successfully
Highlights

ఇస్రోకు రాకెట్ల ప్రయోగం పతంగులు ఎరగేసినంత ఈజీగా మారిపోయింది. మూడు వారాల గ్యాప్ కూడా లేకుండానే వెంట వెంటనే రెండు ప్రయోగాలు చేపట్టింది ఇస్రో. ఈనెల 5వ తేదీన భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించి ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3డీ1 విజయవంతంగా కక్ష్యలోకి చేరింది.  తాజాగా మరో రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో భారత సైంటిస్టులు విజయగర్వంతో పొంగిపోతున్నారు.

ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదైంది.  31 ఉపగ్రహాలతో పీఎస్ఎల్వీ-సీ38 సగర్వంగా నింగికెగిసింది. నెల్లూరులోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా మరో రాకెట్ ప్రయోగించింది. శుక్రవారం ఉదయం పోలార్‌ ఉపగ్రహ వాహకనౌక (పీఎస్‌ఎల్‌వీ)- సీ38 సగర్వంగా నింగికెగసింది.

 దీని బరువు 712 కేజీలు కాగా, మిగిలిన 30 నానో ఉపగ్రహాల బరువు కేవలం 243 కేజీలు.

loader