కేంద్ర ప్రభుత్వం దేశంలో అంతర్యుద్ధాన్ని ప్రేరేపిస్తోందని సీపీఐ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. రైతులతో 11వ విడత చర్చలు కూడా విఫలమైన నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. 

"

ఆయన మాట్లాడుతూ ‘ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులతో శుక్రవారం కేంద్రం జరిపిన చర్చలు విపలమయ్యాయి. ఇది పదకొండోసారి ఇలా అవ్వడం. రైతులకిది జీవన్మరణ సమస్య. అందుకే వారు తమ డిమాండ్ కు కట్టుబడి ఉన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ విధానాలను వారు అంగీకరిస్తే జీవితాంతం దేశంలోని రైతులంతా బానిసలుగా బతకాల్సి వస్తుంది. అందుకే వారు వీటిని అంగీకరించడం లేదు. ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా ఆలోచించాలి. 

వారు రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలకే కట్టుబడి ఉంటామనుకుంటే కష్టం. ఆ చట్టాలను ఎలాంటి కండీషన్లు లేకుండా వెనక్కి తీసుకుంటే గానీ రైతులు ఉద్యమాన్ని ఆపరు. ప్రజాస్వామ్య దేశంలో అందరూ ఇదే కోరుకుంటారు. మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. 

రైతుల ఉద్యమాన్ని అణగదోక్కాలనుకుంటే.. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడమే.. అలా జరిగితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దేశంలో అంతర్యుద్ధం రాకుండా ఉండాలంటే వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, రైతులతో చర్చలు జరపాల’ని డిమాండ్ చేశారు.