నిజమైన రైతులకే పెట్టుబడి సాయం... డిసెంబర్ చివరిలోగా ఖాతాల్లో డబ్బులు జమ.. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..
rythu bandhu : సాగు చేసే నిజమైన రైతులందరికీ ఈ నెలాఖరులోగా పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దాని కంటే ముందు ధరణిలో లోపాలను సరి చేయాల్సి ఉందని తెలిపారు.
MLC Jeevan reddy : తెలంగాణ రైతాంగం ఎంతగానో ఎదురు చూస్తున్న పంట పెట్టుబడి సాయంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ చివరిలోపై రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు ప్రభుత్వం జమ చేస్తుందని హామీ ఇచ్చారు. అయితే పంట సాగు చేసే నిజమైన రైతులకే ఈ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని అన్నారు. దాని కోసం త్వరలోనే సమీక్ష నిర్వహించనుందని చెప్పారు.
తాజ్ మహల్ వద్ద యోగా.. క్షమాపణలు చెప్పిన మహిళా బృందం.. అసలేం జరిగిందంటే ?
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా తీసుకొచ్చిన సేవలను ఆదివారం జగిత్యాల జిల్లాలోని సారంగపూర్ మండలంలోని రేచపల్లిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు పెట్టుబడి సాయం వేసే ముందు ధరణిలో లోపాలను పరిశీలించాల్సి ఉందని చెప్పారు. కొందరు భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొన్ని వందల ఎకరాల భూములను సాగు భూములుగా చూపిస్తున్నారని తెలిపారు.
హిందువుల కలలు సాకారం : రామ మందిరంపై కవిత ఆసక్తికర ట్వీట్
వీరంతా ప్రస్తుతం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పొందుతున్నారని జీవన్ రెడ్డి చెప్పారు. అయితే దీనిపై సమీక్ష జరపాల్సి ఉందని అన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత తమ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సాగు భూములకు కచ్చితంగా పెట్టుబడి సాయం అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రతీ ఒకరానికి రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని ధీమా వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు ఖజానా ఖాళీ చేసి ఇచ్చిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. అయినప్పటికీ వెనకడుగు వేయబోమని చెప్పారు. తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు సంక్షేమ పథకాలను కూడా ఆపబోమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.