తాజ్ మహల్ వద్ద యోగా.. క్షమాపణలు చెప్పిన మహిళా బృందం.. అసలేం జరిగిందంటే ?
performing yoga at Taj Mahal : పలువురు మహిళలు తాజ్ మహల్ (Taj Mahal) ప్రాంగణంలో యోగా (YOGA) చేశారు. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేందుకు రీల్స్ కూడా తీశారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మహిళలు క్షమాపణలు కోరారు.
performing yoga at Taj Mahal : తాజ్ మహల్ వద్ద పలువురు మహిళలు యోగా చేయడం వివాదాస్పదమైంది. దీంతో ఆ మహిళా బృందం క్షమాణలు చెప్పింది. వీరంతా సోషల్ మీడియా కోసం రీల్స్ చేసినట్టు తెలుస్తోంది. చారిత్రాత్మక కట్టమైన తామ్ మహల్ వద్ద ఇలాంటివి చేయడం నిబంధనలకు విరుద్ధం. దానిని ఉల్లంఘించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.
కర్ణాటకలో షిండే దొరికాడు... కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం..: మాజీ సీఎం కుమారస్వామి
ఏం జరిగిందంటే ?..
ఆగ్రాకు చెందిన ఐదుగురు మహిళలు ఆదివారం తాజ్ మహల్ సందర్శిచేందుకు వచ్చారు. అక్కడ ఉన్న ఎర్ర ఇసుక రాయి వేదికపై నలుగురు మహిళలు యోగాసనాలు వేశారు. అనంతరం సూర్య నమస్కారాలు చేశారు. దీనిని వారితో పాటు వచ్చిన మరో మహిళ వీడియో తీశారు. సోషల్ మీడియా కోసం రీల్స్ తీసి, అప్ లోడ్ చేసేందుకు మహిళలు ఈ యోగాసనాలు వేశారు. తాజ్ మహల్ ప్రాంగణంలో ఇలాంటివి చేయడం నిబంధనలకు వ్యతిరేకం. అయితే ఈ విషయం అధికారులకు తెలిసింది.
హిందువుల కలలు సాకారం : రామ మందిరంపై కవిత ఆసక్తికర ట్వీట్
దీంతో అధికారులు ఆ మహిళల దగ్గరికి వెళ్లి ఈ విషయంపై ప్రశ్నించారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారంతా నిబంధనలు ఉల్లంఘించినందుకు క్షమాపణలు కోరారు. మరో సారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మహిళా బృందం నుంచి లిఖితపూర్వక క్షమాణలు తీసుకున్నారు. అనంతరం వారిని అక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతించారు.
కాగా.. శనివారం కూడా తాజ్ మహల్ ప్రాంగణంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ప్రధాన సమాధి చుట్టూ ఉన్న తెల్లని పాలరాతి వేదికపై ఒక వ్యక్తి 'షీర్షాసన్' వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన జరిగిన మరొసటి రోజే మహిళలు కూడా నిబంధనలు ఉల్లంఘించారు. ఈ నేపథ్యంలో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే సందర్శకులు వీడియో తీసి సీఐఎస్ఎఫ్, ఏఎస్ఐ కు సమాచారం ఇవ్వాలని అసోసియేషన్ గైడ్లను అధికారులు కోరారు.