Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్స్‌పై దర్యాప్తు.. బెంగళూరు తర్వాత నగరంలోకి నిందితులు.. రంగంలోకి 20 బృందాలు..!

హైదరాబాద్‌లో రెండు గంటల వ్యవధిలో ఏడు చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు ఉత్తరప్రదేశ్‌లొని పింకు, అశోక్‌లుగా గుర్తించారు. 

investigation continues in hyderabad chain snatching incidents
Author
First Published Jan 8, 2023, 5:08 PM IST


హైదరాబాద్‌లో రెండు గంటల వ్యవధిలో ఏడు చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు ఉత్తరప్రదేశ్‌లొని పింకు, అశోక్‌లుగా గుర్తించారు. వీరు తొలతు బెంగళూరులో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి.. ఆ తర్వాత హైదరాబాద్‌లో మళ్లీ అదే నేరానికి పాల్పడినట్టుగా గుర్తించారు. శుక్రవారం బెంగళూరులో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి.. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం ఉదయం ఉప్పల్ మొదలు పెట్టి.. రాంగోపాల్‌పేట వరకు 10 కి.మీ పరిధిలో ఏడు చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. వృద్దులే టార్గెట్‌‌గా రెచ్చిపోయారు. 

ఈ ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను విశ్లేషించిన పోలీసులు.. నిందితులు రైలులో పారిపోయినట్టుగా అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే వరంగల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు కాజీపేటలో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలో నేరస్థులు లేనట్టుగా తెలుస్తోంది. 

అయితే నిందితులు యూపీ వెళ్లినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. వారి కదలికలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 20 బృందాలను రంగంలోకి దించారు. 

ఇక, చోరీ చేసిన బైక్ మీద తిరుగుతూ ఈ నేరాలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. రాంగోపాల్‌పేట వద్ద చైన్ స్నాచింగ్ అనంతరం పారడైజ్ జంక్షన్ సమీపంలో బైక్ (టిఎస్ 12 ఈఎస్ 7408 రిజిస్ట్రేషన్ నంబర్ గల బ్లాక్ బజాజ్ పల్సర్)ను వదిలి వెళ్లారు. ఆ బైక్‌ను స్వాధీనం చేసుకన్న పోలీసులు.. ఆ బైక్ శనివారం తెల్లవారుజామున నాంపల్లిలోచోరీకి గురైనట్లు గుర్తించారు. నిందితులు గతంలో చైన్ స్నాచింగ్‌లకు సంబంధించి నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత నిందితులు మళ్లీ వరుస చోరీలతో రెచ్చిపోతున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios