సెల్ ఫోన్ కోసం ఫ్రెండ్ ని హత్య చేసిన ఇంటర్ విద్యార్థి

First Published 16, Jul 2018, 2:17 PM IST
inter student killed his friend for cell phone
Highlights

సెల్ ఫోన్ కోసం ఓ ఇంటర్ విద్యార్థి తన స్నేహితుడిని దారుణంగా కాల్చి చంపేశాడు. అది కూడా కిడ్నాప్ చేసి ప్లాన్ ప్రకారం చంపేశాడు.
 

హైదరాబాద్ ఉప్పల్ లో దారుణం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ కోసం ఓ ఇంటర్ విద్యార్థి తన స్నేహితుడిని దారుణంగా కాల్చి చంపేశాడు. అది కూడా కిడ్నాప్ చేసి ప్లాన్ ప్రకారం చంపేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఇంటర్ విద్యార్థి సాగర్ తన స్నేహితుడు ప్రేమ్ ని లాంగ్ డ్రైవ్ కి వెళదామంటూ మూడు రోజుల కిందట బైక్ పై బయటకు తీసుకొని వెళ్లాడు. ఆదిభట్లకు చేరుకున్న తర్వాత ప్రేమ్ ని సాగర్ గన్ తో కాల్చి చంపేశాడు. 

మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మూడు రోజుల తర్వాత సాగర్ హత్య చేసినట్లు తేల్చారు. ప్రస్తుతం పోలీసులు సాగర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 
 

loader