మరో విషాదం.. పరీక్ష మంచిగా రాయలేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య!
విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్ష సరిగా రాయలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

కాలేజీల్లో విద్యార్థుల చావుకేకలు వినిపిస్తున్నాయి. మానసిక ఒత్తిడికి లోనై విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నారు. కన్న బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీళ్లు మిగుల్చుతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ నార్సింగిలో సాత్విక్ ఆత్మహత్య ఘటన మరవకముందే.. తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పరీక్ష సరిగా రాయలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ఏరియాకు చెందిన. కాపెల్లి శివకృష్ణ (18) ప్రగతి జూనియర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో శివకృష్ణ గురువారం తల్లిదండ్రులతో కలిసి పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. శివకృష్ణను పరీక్ష కేంద్రం వద్ద దింపిన తర్వాత తల్లిదండ్రులు మంచిర్యాలకు వెళ్ళిపోయారు.
అనంతరం.. సంస్కృతం పరీక్ష రాసి వచ్చిన శివకృష్ణ తల్లి శారదకు ఫోన్ చేసి పరీక్ష సమయంలో కడుపునొప్పి వచ్చిందని చెప్పాడు. అందుకే పరీక్ష బాగా రాయలేకపోయానని బాధపడ్డారు. దీంతో తల్లి..తన కొడుకుని ఓదార్చుతూ.. ఏం కాదులే బాధపడకని సద్ది చెప్పింది. అయితే.. అతని మాటలు విన్న తల్లి ఆందోళన గురైంది. అనుమానం వచ్చి .. తన కుమారుడి ఫ్రెండ్స్ కు ఓ కంటకనిపెడుకుని ఉండమని తెలిపారు. కానీ వారిందరీ కన్ను గప్పి..ఉరి వేసుకుని శివకృష్ణ కనిపించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పంచనామ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
మరోవైపు.. హన్మకొండలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని ఏడునూతుల గ్రామానికి చెందిన నాగజ్యోతి..హన్మకొండలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బుధవారం ఎగ్జామ్ రాసిన నాగజ్యోతి.. సాయంత్రం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడింది. పరీక్షలు బాగానే రాస్తున్నాననీ,బాగానే చదువుకుంటున్నానని చెప్పింది. కానీ తెల్లారేసరికి దారుణం చోటు చేసుకుంది.
నాగజ్యోతికి సీరియస్‌గా వుందని కాలేజీ నుంచి ఫోన్ రావడంతో తల్లిదండ్రులు వెంటనే హన్మకొండకు చేరుకున్నారు. అసలు విషయాన్ని చెప్పేసింది కాలేజీ యాజమాన్యం. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే నాగజ్యోతి ప్రాణాలు కోల్పోయిందని విద్యార్ధి, ప్రజా సంఘాల ఆందోళన చేపట్టాయి. కూతురు ఇక లేదని, ఇకపై రాదని తెలిసిన కన్నవారు కన్నీరుమున్నీరవుతున్నారు.
మరోవైపు కాలేజీ యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని .. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.