Asianet News TeluguAsianet News Telugu

విద్యార్ధులకు భరోసా.. జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు: సబితా ఇంద్రారెడ్డి

లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీపికబురు  చెప్పారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటిస్తామని ఆమె గురువారం వెల్లడించారు

Inter results released in June Second week says telangana education minister Minister Sabitha Indra Reddy
Author
Hyderabad, First Published May 7, 2020, 6:21 PM IST

లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీపికబురు  చెప్పారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటిస్తామని ఆమె గురువారం వెల్లడించారు.

జవాబు పత్రాల కోడింగ్ ఇవాళ మొదలైందని.. ఈ నెల 12 నుంచి మూల్యాంకనం ప్రక్రియ చేపట్టనున్నట్లు సబిత పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు, ఇంటర్ మూల్యాంకనంపై గురువారం ఆమె అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Also Read:తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. ప్రజలు సహకరించాలి: కేసీఆర్

లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఇంటర్ మోడ్రన్ లాంగ్వెజెస్, జాగ్రఫీ పరీక్షలను ఈ నెల 18న నిర్వహించాలని నిర్ణయించినట్లు సబిత తెలిపారు. మరోవైపు, కరోనా వైరస్ ప్రభావం కారణంగా నిలిపివేసిన పదో తరగతి పరీక్షలను హైకోర్టు అనుమతిస్తే అన్ని జాగ్రత్తలతో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

విద్యార్ధులందరికీ మాస్కులు, శానిటైజర్లు ఇస్తామని తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా పదో తరగతి పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో పాఠశాలలు ఎప్పటి నుంచి పున: ప్రారంభించాలనే అంశంపై కసరత్తు చేసి లాక్‌డౌన్ అనంతరం నిర్ణయిస్తామని మంత్రి పేర్కొన్నారు. 

Also Read:మందుబాబులకు గుడ్ న్యూస్: మద్యం అమ్మకాలకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్

మరోవైపు తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఇచ్చిన ఆయన మద్యం అమ్మకాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios