తల్లి అంత్యక్రియలకు వెళ్తూ.. ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి

Infosys employee killed in road mishap on way to mother's funeral
Highlights

రోడ్డు ప్రమాదంలో  ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి

తల్లి అంత్యక్రియలకు వెళ్తూ.. ఓ కుమారుడు అనంతలోకాలకు చేరుకున్నాడు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా కోదాడ సమీపంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన గోవిందలక్ష్మి అనే వృద్ధురాలు ఆదివారం రాత్రి మృతిచెందారు.  ఆమె కుమారుడు సత్యనారాయణ(32) హైదరాబాద్ లోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.  తల్లి మరణ వార్త తెలుసుకున్న సత్యనారాయణ భార్య వెంకట సౌజన్య, మరదలు వెంకట మాధవితో కలిసి ఓ ప్రైవేటు క్యాబ్‌లో స్వగ్రామానికి బయలు దేరాడు.

కాగా.. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఖమ్మం జిల్లా కోదాడ సమీపంలో లారీ ఢీకొట్టింది. దీంతో.. కారులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ అక్కడిక్కడే మృతి చెందారు. సౌజన్య గర్భవతి కావడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడకు తరలించారు. గాయాల పాలైన డ్రైవర్‌ రాజేశ్‌కు కోదాడలో చికిత్స అందిస్తున్నారు.

తల్లి అంత్యక్రియలకు వస్తూ.. కొడుకు కూడా చనిపోవడంతో.. ఇంట మరింత విషాదం అలుముకుంది. 

loader