కామారెడ్డిలో శిశు మరణాలు అంతు చిక్కడం లేదు. నెలరోజుల వ్యవధిలో ఇలాంటి మరణాలు ఏడు నమోదవడంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు.
కామారెడ్డి : తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో శిశు మరణాలు అంతుచిక్కడం లేదు. నెల రోజుల వ్యవధిలోనే ఇలాంటి మరణాలు ఏడు నమోదయ్యాయి. దీంతో వైద్యులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందుతున్నశిశువులంతా నాలుగు నెలల వయసు లోపు చిన్నారులే. అస్వస్థతతో ఆసుపత్రికి చేరిన చిన్నారులను వైద్యులు పరీక్షిస్తుండగానే వారి ఊపిరి ఆగిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో అంతుపట్టక వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
