Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్.. ట్రాఫిక్ అడ్వైజరీ జారీ.. ప‌లుచోట్ల ఆంక్ష‌లు

Hyderabad: హైదరాబాదులోని హుస్సేన్ సాగ‌ర్ తీరంలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్ ను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. రేసింగ్ లీగ్ నేప‌థ్యంలో ట్రాఫిక్ అధికారులు ఆదివారం ప‌లు చోట్ల ఆంక్ష‌లు విధిస్తూ.. ట్రాఫిక్ అడ్వైజ‌రీ జారీ చేశారు.

Indian Racing League in Hyderabad.. Traffic Advisory issued.. Restrictions in many places
Author
First Published Nov 20, 2022, 3:05 AM IST

Indian Racing League:  రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాదులోని హుస్సేన్ సాగ‌ర్ తీరంలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్ ను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. రేసింగ్‌కు ముందు ట్రయల్ రన్ నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఫార్ములా-ఈ రేసు ప్రిపరేషన్‌లో భాగంగా ఇండియన్ రేసింగ్ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. రేసింగ్ లీగ్ నేప‌థ్యంలో ట్రాఫిక్ అధికారులు ఆదివారం ప‌లు చోట్ల ఆంక్ష‌లు విధిస్తూ.. ట్రాఫిక్ అడ్వైజ‌రీ జారీ చేశారు.

 

వివ‌రాల్లోకెళ్తే.. హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ ఈవెంట్‌ల దృష్ట్యా ఆదివారం ఖైరతాబాద్ జంక్షన్, తెలుగు తల్లి జంక్షన్, ఐమాక్స్ నెక్లెస్ రోటరీ స్ట్రెచ్‌లను మూసివేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వయిజరీ జారీ చేశారు. ఈ స్ట్రెచ్‌ను రేసుల కోసం సిటీ సర్క్యూట్‌గా ఉపయోగిస్తున్నారు. అలాగే, మింట్ కాంపౌండ్ రోడ్డుకు అనుసంధానించే రోడ్లు మూసివేయబడతాయి. వాహనదారులు ఖైరతాబాద్ జంక్షన్ నుంచి షాదన్, నిరంకారి, సైఫాబాద్ పాత పోలీస్ స్టేషన్, ఇక్బాల్ మినార్ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు వెళ్లవచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఇక్బాల్ మినార్ వైపు నుండి ట్యాంక్ బండ్ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. ట్యాంక్ బండ్ నుండి ఇక్బాల్ మినార్ వైపు వాహనాలు అనుమతించబడతాయి. నవంబర్ 21 వరకు ట్యాంక్ బండ్, పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్), ఖైరతాబాద్ జంక్షన్, ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి జంక్షన్ చుట్టుపక్కల ఉన్న రోడ్లలో రాక‌పోక‌ల‌ను నివారించాలని పోలీసులు వాహనదారులను కోరారు. అలాగే, ఇండియ‌న్ రేసింగ్ లీగ్ క్ర‌మంలో కార్ రేసులను చూసేందుకు వెళ్లే వారి కోసం పార్కింగ్ ఏర్పాట్లను గురించి కూడా పోలీసులు ప్ర‌స్తావించారు.  పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్), ఎన్టీఆర్ స్టేడియం, పీపుల్స్ ప్లాజా, నిజాం కళాశాలలో 12 పార్కింగ్ స్థలాలను కేటాయించినట్లు పోలీసులు తెలిపారు.

 

ఈ కార్యక్రమానికి ఆరు ప్రవేశ ద్వారాలలో, రెండు తెలుగు తల్లి జంక్షన్ వైపు నుండి, ఒకటి ఐమాక్స్ రోటరీ నుండి, ఒకటి ఐమాక్స్ ఎదురుగా, రెండు బడా గణేష్ లేన్ వద్ద ఉన్నాయి. “పార్కింగ్ పాయింట్ల నుండి ఎంట్రీ గేట్ల వరకు షటిల్ బస్సులు అందించబడతాయి. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణించే ప్రయాణికులు ప్రవేశ ద్వారం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నామని పోలీసులు తెలిపారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios