భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ : రెండు వారాల క్రితమే అమ్ముడైపోయిన టికెట్లు.. పోలీసులకు తలనొప్పిగా మారిన మ్యాచ్..

వచ్చే ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్లు మొత్తం రెండు వారాల క్రితమే అమ్ముడైపోయాయి. 

India Vs Australia match : all tickets were sold in Two weeks ago in hyderabad

హైదరాబాద్ :  ఈ ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం నిర్వాహకులు ఇప్పటికే టికెట్లు అమ్మేశారు. మొత్తం స్టేడియం సీటింగ్ కెపాసిటీ 60వేలు కావడంతో రెండు వారాల క్రితమే మొత్తం టికెట్లను నిర్వాహకులు అమ్మేశారు. టికెట్ల అమ్మకాలపై భారీగా అవకతవకలు జరిగాయని క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈరోజు జింఖానా గ్రౌండ్స్ లో మరోసారి టికెట్ అమ్మకాలను నిర్వాహకులు నిర్వహించారు.  

నిజానికి  టికెట్ ఎప్పుడో అయిపోయాయి అన్న విషయం తెలియక  అక్కడికి వేలాది మంది క్రికెట్ అభిమానులు చేరుకున్నారు. అసలు ఎన్ని టికెట్లు అందుబాటులో ఉన్నాయి అన్న విషయం సైతం నిర్వాహకులు బయటకు చెప్పడం లేదు. దీంతో అక్కడికి వచ్చిన అభిమానులను కంట్రోల్ చేయలేక హైదరాబాద్, రాచకొండ పోలీసులకు ఈ మ్యాచ్ తలనొప్పిగా మారింది. 

జింఖానా స్టేడియం వద్ద క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం తొక్కిసలాట: పలువురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

అయితే,  సికింద్రాబాద్ జింఖానా స్టేడియం వద్ద అభిమానులు ఒక్కసారిగా టికెట్ల కోసం ఎగబడటం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. పోలీసులకు అభిమానులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాటతో అనేకమంది కిందపడి ఊపిరాడక ఇబ్బంది పడ్డారు.

క్రికెట్ అభిమానులు టికెట్ల కోసం నాలుగైదు రోజులుగా హెచ్సీఏ, జింఖాన గ్రౌండ్స్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఆఫ్లైన్, ఆన్లైన్లో టికెట్ల విక్రయం చేయలేదు. టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గురువారం నుంచి టిక్కెట్లు విక్రయం చేపట్టనున్నట్లు హెచ్సీఏ ప్రకటించింది. ఉప్పల్ స్టేడియంలో 55 వేలకుపైగా సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల కెపాసిటీ మేరకు హెచ్సీఏ టికెట్లను విక్రయించాల్సి ఉంటుంది. ఇందులో 39 వేల టిక్కెట్లు ఆఫ్లైన్లో విక్రయించాలి.. మిగిలిన టికెట్లను ఆన్లైన్లో అమ్మాలి.

ఈ నెల 15వ తేదీ నుండి టికెట్ల విక్రయం చేపట్టనున్నట్లు హెచ్సీఏ ప్రకటించింది. ఈ నెల 15న ఆన్లైన్లో టికెట్ల విక్రయం ప్రారంభించిన కొద్దిక్షణాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో ఆఫ్లైన్లో టికెట్ల కోసం అభిమానులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే హెచ్డీ నుండి ఎలాంటి స్పందన రాలేదు. టికెట్ల విక్రయంలో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై విచారణ జరపాలని హైకోర్టు న్యాయవాది సలీం హెచ్ఆర్సీలో ఈనెల 20వ తేదీన ఫిర్యాదు చేశారు. 

హెచ్ సీఏ సరైన ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తోపులాట.. గందరగోళ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ సీఏ నోరు మెదపకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. హెచ్ సీఏ మీద చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు అంటున్నారు. అయితే, తోపులాటలో కొందరు గాయపడ్డారు తప్పితే ఎవరూ చనిపోలేదని తెలిపారు. ప్రస్తుతం జింఖానా గ్రౌండ్స్ లో టిక్కెట్ల అమ్మకాన్ని నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ లో ఎన్ని టికెట్లు అమ్మారో హెచ్ సీఎ వివరణ ఇవ్వలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios