వచ్చే 25 ఏళ్లకు రోడ్ మ్యాప్: హైద్రాబాద్ లో ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో మోడీ
ఆసియాలోనే ఐఎస్‌బీ అతి పెద్ద బిజినెస్ స్కూల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. వచ్చే 25 ఏళ్ల వరకు కేంద్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ను సిద్దం చేస్తుందన్నారు.ఈ రోడ్ మ్యాప్ లో ఐఎస్ బీ విద్యార్ధులను భాగస్వామ్యులు కావాలన్నారు.
హైదరాబాద్: వచ్చే 25 ఏళ్ల వరకు రోడ్ మ్యాప్ ను సిద్దం చేస్తున్నామని ప్రధానమంత్రి Narendra Modiచెప్పారు. ఈ ప్రణాళికలో మీకు కీలక పాత్ర ఉంటుందని మోడీ ISB విద్యార్ధులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీ లక్ష్యాన్ని దేశ లక్ష్యంతో జోడించి ముందుకు సాగాలని ఆయన సూచించారు.21వ శతాబ్దపు భారతదేశం ఆత్మ నిర్భర్ భారత్ ,మేక్ ఇన్ ఇండియా కలలతో ముందుకు సాగుతుందన్నారు.
ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. గురువారం నాడు Hyderabad, Mohaliఐఎస్ బీ స్నాతకోత్సవాన్ని సంయుక్తంగా నిర్వహించారు. 960 మంది విద్యార్ధులు ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. బేగంపేట నుండి హెలికాప్టర్ లో ప్రధాని నరేంద్ర మోడీ HCIU కి చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో ఐఎస్‌బీకి చేరుకున్నారు. ఐఎస్ బీ ప్రాంగంణంలో ప్రధాని నరేంద్ర మోడీ తొలుత మొక్కను నాటారు.తొలుత మెరిట్ విద్యార్ధులకు ప్రధాని నరేంద్ర మోడీ గోల్డ్ మెడల్స్, సర్టిపికెట్లు అందించారు.
ఈ సందర్భంగా ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఐఎస్‌బీ ఒక మైలురాయివంటిదని ఆయన చెప్పారు. 20 ఏళ్ల వసంతాలను ఐఎస్‌బీ జరుపుకుంటుందని మోడీ చెప్పారు.50 వేల మంది ఇక్కడ శిక్షణ పొంది బయటకు వెళ్లారని ప్రధాని మోడీ వివరించారు. Asiaలోనే ఉత్తమ సంస్థల్లో ఐఎస్‌బీ ఒకటిగా నిలిచిందన్నారు.ఇక్కడి విద్యార్ధులు ఎన్నో స్టార్టప్ లు మొదలు పెట్టిన విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఐఎస్‌బీలో చదివినవారు ఎంతో మంది విదేశాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. ఐఎస్బీ ఈ స్థాయికి రావడం వెనుక చాలా మంది కృషి ఉందన్నారు.. 2001లో వాజ్ పేయ్ ఈ స్కూల్ ను ప్రారంభించారన్నారు. ఆసియాలోనే ఐఎస్ బీ టాప్ బిజినెస్ స్కూల్ అని ఆయన చెప్పారు.జీ 20 దేశాల్లో భారత్ అతి వేగంగా అభివృద్ది చెందుతుందన్నారు.ఇంటర్నెట్ వాడకంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉందన్నారు.
2014 నుండే నిరంతరం సంస్కరణలు అమలౌతున్నాయన్నారు. ఇండియా అంటే బిజినెస్ అని ప్రపంచం నమ్ముతుందని మోడీ చెప్పారు.ప్రపంచాన్ని నడిపించగలమని భారత యువత చాటి చెబుతుందన్నారు.భారత్ చెప్పే పరిష్కారాలలను ప్రపంచం మొత్తం అమలు చేస్తుందని మోడీ తెలిపారు.దేశ లక్ష్యాల కోసం యువత పనిచేయాలని కోరారు. యువతతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం కూడా సిద్దంగా ఉందన్నారు. దేశ పరిపాలనలో ఎన్నో మార్పులు తెచ్చినట్టుగా మోడీ గుర్తు చేశారు.ఆలోచనలు బాగుండి క్షేత్రస్థాయిలో పనికి రాకపోతే ఉపయోగం ఉండదని ఆయన చెప్పారు. గత 30 ఏళ్లలో సంస్కరణల కోసం రాజకీయ సంకల్పం కన్పించలేదని ఆయన చెప్పారు. నిజాయితీ, సంకల్పంతో పనిచేస్తే ప్రజా మద్దతు లభిస్తుందన్నారు
also read:దేవేగౌడతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ: జాతీయ రాజకీయాలపైచర్చ
ఒకవైపు సంస్కరణలు, మరో వైపు అభివృద్దితో భారత్ ముందుకు వెళ్తుందని మోడీ చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ భారత్ ముందుందన్నారు. భారత్ లో మెడికల్ కాలేజీల సంఖ్య రెట్టింపైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.380 మెడికల్ కాలేజీలు 600కి పెరిగాయన్నారు.పీజీ సీట్లు 90 వేల నుండి 1.50 లక్ఖలకు పెరిగినట్టుగా మోడీ గుర్తు చేశారు.కరోనా సమయంలో ఇండియాలో పీపీఈ కిట్స్ కూడా తయారు చేసే వాళ్లు కూడా లేరన్నారు.ప్రపంచంలో అత్యధిక డిజిటల్ లావాదేవీలు ఇండియాలోనే జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.
యువత టాలెంట్ పేపర్లకు మాత్రమే పరిమితం కాకూడదన్నారు.పాలసీలు ఏదైనా తీసుకుంటే అవి ఒక గదికో, పేపర్లకు పరిమితం కాకూడదన్నారు. అలా అయితే ప్రయోజనం ఉండదన్నారు. 2014 తరువాత దేశంలో చాలా మార్పులు జరిగాయన్నారు..అవన్నీ ప్రజల కళ్ళ ముందు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. చిన్న పని కోసం బ్యాంకు లకు వెళ్లే రోజులు కావన్నారు...ప్రతి ఒక్కరి చేతిలోకే బ్యాంకింగ్ సెక్టార్ ఉన్న రోజులివి అని మోడీ చెప్పారు. డిజిటల్ వ్యవస్థలో బ్యాంకింగ్ సెక్టార్ లో కీలక మార్పులు జరిగాయన్నారు.
వ్యాక్సిన్ లు కొనే పరిస్థితి నుంచి తయారు చేసి అమ్మే స్థాయికి దేశం అభివృద్ధి చెందిందని చెప్పారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ ను 100 దేశాలకు ఇండియా ఇచ్చిందన్నారు. క్రీడల్లో సైతం ఇండియా సత్తా చాటుతోందన్నారు. కేలో ఇండియా పేరుతో క్రీడాకారులకు కేంద్రం ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు.
ఐఎస్ బీలో ప్రసంగం పూర్తైన తర్వాత మోడీ బేగంపేట విమానాశ్రయం వెళ్లేందుకు ఎవియేషన్ అదికారులు అనుమతివ్వలేదు. వాతావరణంలో మార్పులు రావడంతో రోడ్డు మార్గంలోనే మోడీ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు.