Asianet News TeluguAsianet News Telugu

హెచ్‌సీఏ దగ్గరే వేల టికెట్లు.. ఉప్పల్ స్టేడియంలో సీక్రెట్‌గా పంపకాలు, అజార్ మాటలపై అనుమానాలు

టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టడానికి కూడా లేవని, మొత్తం అమ్ముడయ్యాయని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ చెప్పిన మాటలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉప్పల్ స్టేడియం వద్ద గుట్టుచప్పుడు కాకుండా టికెట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 

india australia match tickets distribution secretly at uppal stadium
Author
First Published Sep 23, 2022, 8:36 PM IST

టికెట్ల పంపిణీ తమ చేతుల్లో లేదు అని చెప్పిన హెచ్‌సీఏ దొడ్డిదారిన పంపకాలు చేస్తోంది. టికెట్ల అమ్మకాలు మొత్తం పేటీఎంకి అప్పగించామని చెబుతూ.. తమ దగ్గర వేల సంఖ్యలో టికెట్లు పెట్టుకుంది. హెచ్‌సీఏ సిబ్బంది ఏకంగా స్టేడియంలోనే టికెట్ల పంపిణీ మొదలుపెట్టారు. తమ అనుచరులుకు ఇష్టానురీతిలో టికెట్లను ఇచ్చుకున్నారు. మూడు సూడు కేసుల్లో టికెట్లు తీసుకొచ్చి.. స్టేడియం లోపల సీక్రెట్‌గా పంపకాలు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది,

ఆ వార్తాకథనం ప్రకారం.... హెచ్‌సీఏ ఆధ్వర్యంలో వున్న క్రికెట్ క్లబ్‌లు, వీఐపీలకు ఇక్కడి నుంచే పంపిణీ చేశారు. మరోవైపు టికెట్లు పంపిణీ చేస్తున్నారని సమాచారం అందుకున్న అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అయితే ఇవి కాంప్లిమెంటరీ టికెట్లా లేక అసలైనవా అన్నది తెలియాల్సి వుంది. ప్రెస్‌మీట్‌లో అజారుద్దీన్ చెప్పిన టికెట్ల లెక్కకు, పంపిణీ చేస్తోన్న టికెట్ల మధ్య కొంత తేడా వున్నట్లుగా తెలుస్తోంది. 

ALso REad:జింఖానా గ్రౌండ్స్ తొక్కిసలాటలో నా తప్పుంటే అరెస్టు చేయండి: హెచ్ సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్

అంతకుముందు టికెట్ల విక్రయం, జింఖానా గ్రౌండ్‌లో తొక్కిసలాటకు సంబంధించి హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టికెట్ల విక్రయానికి సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగలేదన్నారు. బ్లాక్ టికెట్లు అమ్మినట్లు తేలితే తనను అరెస్ట్ చేసుకోవచ్చని అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. బ్లాక్ టికెట్లు ఎవరు అమ్మినా చర్యలు తీసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. నిన్నటి ఘటనలో తీవ్రంగా గాయపడిన వారందరికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున వైద్య చికిత్సను భరిస్తామని అజారుద్దీన్ వెల్లడించారు. 

మ్యాచ్‌కు సంబంధించి టికెట్లను బ్లాక్ చేయలేదని హెచ్ సీ ఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ తెలిపారు. ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా ఏళ్ల తర్వాత హైద్రాబాద్ లో మ్యాచ్ నిర్వహణకు అవకాశం వచ్చిందన్నారు. పేటీఎం ద్వారా ఆన్ లైన్ లో టికెట్లు విక్రయించినట్టుగా అజహరుద్దీన్ తెలిపారు.   ఈ మ్యాచ్ ను విజయవంతం  చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios